Begin typing your search above and press return to search.
సూర్య సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్ లోనేనా!
By: Tupaki Desk | 27 Jan 2022 9:30 AM GMTకరోనా రాకతో ఓటీటీ విస్తరించిన విధానం గురించి తెలిసిందే. భవిష్యత్ ఎంటర్ టైన్ మెంట్ అంతా కూడా ఓటీటీ కే అంకితమని క్లారిటీ వచ్చేసింది. దీంతో హీరోలు..దర్శక..నిర్మాతలు ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కంటెంట్ ని వాటికి అమ్మడానికే ఆసక్తిచూపిస్తున్నారు.
ఈ వరుసలో కోలీవుడ్ హీరో సూర్య ముందు కనిపిస్తున్నాడు. సూర్య హీరోగా నటించిన గత రెండు చిత్రాలు `సరరై పట్టు`..`జైభీమ్` చిత్రాలు నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెండు చిత్రాలు సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాణం జరగడంతో తెలివిగా ఓటీటీ రిలీజ్ కి వెళ్లిపోయారు.
ఆ రెండు చిత్రాలు అక్కడా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య తాజాగా ఓటీటీ సంస్థ అమెజాన్ తో బిగ్ డీల్ కుదర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చింది. తన నిర్మాణం సంస్థలో తెరకెక్కే సినిమాలు ..ఇతర కంటెంట్ మొత్తం అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు హింట్ ఇచ్చారు.
సినిమాలు థియేటర్ రిలీజ్ కన్నా ఓటీటీ రిలీజ్ అయితే సేఫ్ గా ఉంటామని సూర్య..తన టీమ్ నిర్ణయించుకుని ఓటీటీతోనే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఓటీటీ ముందుకొస్తున్న నేపథ్యంలో సదరు సంస్థతో కలిసి ఆ రకంగాను ముందుకెళ్లాలని సూర్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ రిలీజ్ ద్వారా తన కంటెంట్ వరల్డ్ వైడ్ పక్కాగా రీచ్ అవుతుందని...2 డీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే కంటెంట్ పాన్ ఇండియాకి రీచ్ అవ్వాలంటే ఓటీటీనే ఉత్తమ మార్గం అని సూర్య టీమ్ సైతం బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇది మంచి ఐడియానే.
ఇటీవలే బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఓ కార్పోరేట్ ఓటీటీ సంస్థతో 400 కోట్ల రూపాయాల డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇంకా మరెంతో మంది హీరోలు..నిర్మాతలు ఇదే మార్గంలో వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సూర్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆయన కొత్త చిత్రం `ఎతుర్కం తునింధవన్` కూడా అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి పాండిరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.