Begin typing your search above and press return to search.

భారీ ఈవెంట్ లు నిర్మాత‌ల‌కు హెల్ప్ అవుతున్నాయా?

By:  Tupaki Desk   |   6 Dec 2022 12:30 AM GMT
భారీ ఈవెంట్ లు నిర్మాత‌ల‌కు హెల్ప్ అవుతున్నాయా?
X
టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో ఒక చిన్న సినిమా ద‌గ్గ‌రి నుంచి పెద్ద సినిమా వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ కోసం మేక‌ర్స్ కోట్ల‌ల్లో ఖ‌ర్చు చేస్తున్న విష‌యం తెలిసిందే. చిన్న సినిమాకు చిన్న రేంజ్ లో పెద్ద సినిమాల‌కు పుద్ద రేంజ్ లో ఈవెంట్ లు.. ప్ర‌మోష‌న్స్ ని నిర్మాత‌లు భారీ స్థాయిలో చేస్తున్న విష‌యం తెలిసిందే. సినిమా నిర్మాణానికి బ‌డ్జెట్ ని కేటాయిస్తున్న నిర్మాత‌లు ప‌బ్లిసిటీ కోసం కూడా భారీ స్థాయిలోనే ఖ‌ర్చు చేస్తున్నారు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ తో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన `RRR` మేకింగ్ కోసం భారీ స్థాయిలో బ‌డ్జెట్ ని కేటాయించిన మేక‌ర్స్ అదే మూవీని పాన్ ఇండియా వైడ్ గా ప్ర‌మోష‌న్స్ చేయ‌డం కోసం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసిన విష‌యం తెలిసిందే. ఇంత ఖ‌ర్చు చేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. అయినా స‌రే ఈ మూవీ కోసం అంత ఖ‌ర్చు చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ రాజ‌మౌళి దేశ వ్యాప్త‌ ప్ర‌మోష‌న్స్ కోసం ఖ‌ర్చు చేయించార‌ట‌.

దీనికి పెట్టిన ఖర్చు రిజ‌ల్ట్ రూపంలో క‌నిపించడం తెలిసిందే. ఇదిలా వుంటే ప్ర‌తీ నిర్మాత స‌క్సెస్ మీట్ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ల కోసం గ‌త కొన్నేళ్లు గా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఓ ఈవెంట్ కంప‌నీకి భారీగా అంద‌జేస్తున్నారు. టాలీవుడ్ లో భారీ ఈవెంట్ కోసం ఒకే ఒక సంస్థ వున్న విష‌యం తెలిసిందే. హీరోల‌ని ఇంప్రెస్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ప్రొడ్యూస‌ర్ లు భారీ స్థాయిలో ఈవెంట్ ల‌ని నిర్వ‌హిస్తు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. అయితే అవి ఎంత వ‌ర‌కు సినిమాకు యూస్ ఫుల్ అవుతున్నాయ‌న్న‌దే ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

ఎన్ని కోట్లు పెట్టి ఈవెంట్ సంస్థ‌ల‌తో ప్ర‌మోష‌న్స్ చేయించినా సినిమాలో స‌రైన కంటెంట్ లేక‌పోతే మండే రోజుకే థియేట‌ర్లు ఖాళీ అవుతున్న ప‌రిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి లావిష్ ఈవెంట్ ల కోసం ప్ర‌త్యేకంగా ఈవెంట్ ఏజెన్సీ టాలీవుడ్ లో ఒక్క‌టే వుండ‌టం.. దాని కోసం ప్రొడ్యూస‌ర్ లు ఎగ‌బ‌డుతుండ‌టం తెలిసిందే.

స‌ద‌రు ఈవెంట్ ఏజెన్సీ కోసం ఖ‌ర్చు చేస్తున్న ప్రొడ్యూస‌ర్లు ఆ ఖ‌ర్చు స్థాయిలో ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లుగుతున్నారా? .. ఆ డ‌బ్బుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లాన్ని పొందుతున్నారా.. అంటే నో ఆన్స‌ర్‌. మ‌రి ఈ భారీ ఈవెంట్ లు ఎవ‌రికి లాభంగా మారుతున్న‌ట్టు?.. అన్న‌ది వారికే తెలియాలి అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.