Begin typing your search above and press return to search.
పవన్ కారణంగా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారా..?
By: Tupaki Desk | 22 July 2022 2:30 AM GMTగతేడాది 'వకీల్ సాబ్' వంటి రీమేక్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది 'భీమ్లా నాయక్' అనే మరో రీమేక్ తో వచ్చాడు. ఈ క్రమంలో మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ దర్శక నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాలో పవన్ నటించనున్నారు.
ఒరిజినల్ వర్సన్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ ను ధ్రువీకరించారు.
పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథలో మన నెటివిటీకి తగినట్లుగా కీలక మార్పులు చేర్పులు చేసినట్లు టాక్ ఉంది. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందే ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. 'హరి హర వీరమల్లు' 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలను కాదని పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'వినోదయ సీతమ్' రీమేక్ ముందుగా అనుకున్న విధంగా షూటింగ్ ప్రారంభించడం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తారనే దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో.. షూటింగ్ అప్డేట్ పై దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ లేదని అంటున్నారు.
పవన్ ఇటీవల కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలలో బిజీగా గడిపారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురి కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. అయితే 'వినోదయ సీతమ్' సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో సాయి తేజ్ - సముద్రఖని ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారని టాక్. ఇది సాయి తేజ్ తో సినిమా చేస్తున్న నిర్మాతలను కూడా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.
గతేడాది సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురి కావడంతో కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి కోలుకున్న తర్వాత బివిఎస్ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మించే మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే మేనమామతో సినిమా కారణంగా తేజ్ ప్రాధాన్యత మారిపోయిందని.. మిస్టిక్ థ్రిల్లర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని టాక్ వచ్చింది.
అంతేకాదు పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ సినిమా పూర్తయ్యే వరకు ఇతర చిత్రాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందట. మరోవైపు దర్శకుడు సముద్రఖని కూడా పవన్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని భావించి కొన్ని ఇతర కమిట్మెంట్లను హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు రీమేక్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
అలానే గత రెండేళ్లుగా షూటింగ్ దశలోనే ఉన్న 'హరి హర వీరమల్లు' సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేసారనేది తెలియడం లేదు. డైరెక్టర్ క్రిష్ - నిర్మాత ఏఎం రత్నం పవన్ కాల్ కోసం వేచి చూస్తున్నారట. ఇక 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని ప్రారంభించాలని పవన్ డేట్స్ కోసం చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ మరియు మైత్రీ నిర్మాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. మరి త్వరలో పవన్ అన్ని సినిమాల షూటింగులు సవ్యంగా జరిగేలా ప్లాన్ చేసుకుంటాడేమో చూడాలి.