Begin typing your search above and press return to search.

కమల్‌ లో ఇంకా సీక్వెల్‌ ఆశలు చిగురించే ఉన్నాయా?

By:  Tupaki Desk   |   27 May 2022 11:00 AM IST
కమల్‌ లో ఇంకా సీక్వెల్‌ ఆశలు చిగురించే ఉన్నాయా?
X
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. సుదీర్ఘ కాలం తర్వాత భారతీయుడుకు సీక్వెల్‌ ను చేయాలనే ఆలోచన శంకర్ కు వచ్చింది. కమల్‌ కూడా చాలా ఆసక్తిగా సీక్వెల్‌ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పడం.. చకచక లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం మొదలు పెట్టారు. కొన్ని కారణాల వల్ల సినిమా మధ్యలో ఆగిపోయిన విషయం తెల్సిందే.

ఇండియన్ 2 సినిమా విషయంలో నిర్మాణ సంస్థ లైకా వారికి మరియు శంకర్‌ మధ్య చాలా పెద్ద వివాదం జరిగింది.. అది కాస్త కోర్టు వరకు వెళ్లి చాలా రాద్దాంతం జరిగింది. దాంతో శంకర్ ఖచ్చితంగా ఇండియన్ 2 సినిమా ను మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు లేవని అంతా భావిస్తున్నారు. లైకా వారు కూడా చాలా సీరియస్ గానే శంకర్ పై ఉన్నారు. ఆయనతో మళ్లీ వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా లేరంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.

సూపర్ హిట్ సీక్వెల్‌ దాదాపుగా అటకెక్కినట్లే అంటూ అంతా భావిస్తున్న సమయంలో కమల్‌ హాసన్ మాత్రం తనకు ఇంకా ఆశ ఉందని.. తన లో ఇండియన్ 2 గురించిన ఆశలు చిగురించే ఉన్నాయి అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన నటించిన విక్రమ్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ ఇండియన్ 2 గురించి మాట్లాడాడు.

ఇండియన్ 2 సినిమా పూర్తిగా క్యాన్సిల్‌ అయినట్లుగా తాను భావించడం లేదని పేర్కొన్నాడు. మేకర్స్ మద్య చర్చలు జరుగుతున్నాయి.. తర్వలోనే మళ్లీ సెట్స్ పైకి ఇండియన్‌ 2 వెళ్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. మొదటి నుండి కూడా కమల్‌ ఇదే ఆశతో ఉన్నాడు. కాని లైకా వారు మరియు శంకర్‌ ల మద్య అస్సలు రాజీ కుదిరే అవకాశాలు కనిపించడం లేదు.

ఒక వేళ శంకర్ ససేమేరా అంటే అప్పుడు స్వయంగా కమల్‌ హాసన్ ప్రాజెక్ట్‌ ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం విక్రమ్‌ పనులతో బిజీగా ఉన్న కమల్‌ హాసన్ ఆ తర్వాత ఇండియన్ 2 గురించి మరింత శ్రద్ద పెట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరో వైపు శంకర్‌ ప్రస్తుతం తెలుగు లో చరణ్ తో ఒక సినిమా ను చేస్తున్నాడు. చరణ్‌ సినిమా తర్వాత హిందీలో అపరిచితుడు చేయబోతున్నాడు. కనుక ఇండియన్ 2 గురించిన ఆలోచన శంకర్ కు ఉన్నట్లుగా అనిపించడం లేదు. చివరకు ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందో చూడాలి.