Begin typing your search above and press return to search.
'బిగ్ బాస్ 5' హోస్ట్ గా ముగ్గురి పేర్లు వస్తున్నాయా..?
By: Tupaki Desk | 8 July 2021 2:30 PM GMTగత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో గురించే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 'బిగ్ బాస్' తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలైన మజాని పరిచయం చేయడమే కాకుండా.. ఎంతో మందిని బిగ్ సెలబ్రిటీస్ గా మార్చేసింది. తెలుగు టెలివిజన్ స్క్రీన్ మీద టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసిన 'బిగ్ బాస్'.. అదిరిపోయే రెస్పాన్స్ అందుకుని ఏకంగా నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ ను విజయవంతంగా నడిపించిన 'స్టార్ మా' వారు.. ఇప్పుడు 'బిగ్ బాస్ 5' కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హోస్ట్ గా ఎవరు ఉంటారనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన అక్కినేని నాగార్జున ఐదో సీజన్ కు కూడా హోస్ట్ గా ఉంటారని అనుకుంటుండగా.. ఇప్పుడు అనూహ్యంగా మరో ముగ్గురు స్టార్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.
తెలుగులో 'బిగ్ బాస్' ఇంత సక్సెస్ అవడానికి నిర్వాహకులతో పాటుగా షో ని ఇంట్రెస్టింగ్ నడిపించిన హోస్టులు కూడా కారణమని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని పూణేలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో నిర్వహించిన బిగ్ బాస్' మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. టాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యాతగా ఉండటంతో బుల్లితెర ప్రేక్షకుల అందరి దృష్టి ఈ షో పై పడింది. 'నా టీవీ' అంటూ తారక్ తనదైన శైలిలో హోస్టింగ్ చేసి 'బిగ్ బాస్ 1' విజయవంతం అయ్యేలా చేసాడు. దీంతో సీజన్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో సహజమైన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని.. 'బిగ్ బాస్ తెలుగు - 2' షో కు హోస్ట్ గా వచ్చారు. 'నాని టీవీ' అంటూ తన స్టైల్ లో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ ను ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తే.. నాని దాన్ని కొనసాగించగలిగారు.
'బిగ్ బాస్ 3' కి 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తారని ప్రకటించడంతో ఈ షో పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 'మన టీవీ' అంటూ నాగార్జున తనదైన మేజరిజంతో అలరించాడు. అప్పటికే ప్రేక్షకాదరణ తెచ్చుకున్న షో ను నాగ్ మరో స్థాయికి తీసుకెళ్లారనే చెప్పాలి. అప్పటికి బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా 'బిగ్ బాస్' మూడో సీజన్ ను నిలిపారు. ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్' నాల్గవ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా కొనసాగించారు. ఈసారి నాగ్ రెట్టింపు ఉత్సాహంతో వీకెండ్ లో డ్యాన్స్ కూడా చేస్తూ ఎంటర్టైన్ చేశారు. అంతేకాదు అప్పటి వరకు 'బిగ్ బాస్' హోస్ట్ అంటే సూటు బూటు వేసుకుంటారనే ట్రెండ్ ని కూడా మార్చేశారు. ఈ క్రమంలో 'బిగ్ బాస్ 4' ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై హయ్యెస్ట్ టీఆర్పీ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో అందరూ 'బిగ్ బాస్ 5' కు నాగార్జున హోస్ట్ గా ఉంటారని అందరూ ఫిక్స్ అయ్యారు.
అయితే ఇప్పుడు 'బిగ్ బాస్' ఐదో సీజన్ నుంచి నాగార్జున తప్పుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకున్న నాగ్.. 5వ సీజన్ కోసం డేట్స్ కేటాయించలేనని చెప్పారట. అందుకే ఈ ఒక్క సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు తెర పైకి వచ్చాయి. ఆల్రెడీ టీవీ హోస్టుగా చేసిన అనుభవం ఉన్న రానా నే 'బిగ్ బాస్-5' తెలుగు హోస్ట్ గా తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా చరణ్ - బన్నీ ల పేర్లు కూడా నిర్వాహకులు పరిశీలిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' వంటి రెండు క్రేజీ సినిమాల షూటింగ్ ల్లో పాల్గొనడంతో పాటుగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని ప్రారంభించాలని చూస్తున్నాడు. మరోవైపు 'పుష్ప 1' సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న అల్లు అర్జున్.. 'ఐకాన్' 'పుష్ప 2' చిత్రాలతో పాటుగా మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఇంత బిజీగా ఉన్న వీరిద్దరూ 'బిగ్ బాస్ 5' షో కోసం డేట్స్ ఇస్తారా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో నాగార్జున - రానా - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లలో ఎవరు హోస్ట్ గా ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి త్వరలోనే 'బిగ్ బాస్ 5' హోస్ట్ ఎవరనేది నిర్వాహకులు అధికారికంగా ప్రకటించి.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.