Begin typing your search above and press return to search.

బాలయ్య కోసం ఇంతమంది దర్శకులు వెయిటింగా?!

By:  Tupaki Desk   |   23 April 2022 2:30 AM GMT
బాలయ్య కోసం ఇంతమంది దర్శకులు వెయిటింగా?!
X
మొదటి నుంచి కూడా బాలకృష్ణ కి ఒక అలవాటు ఉంది. తన సినిమా ఫ్లాప్ అయినా .. హిట్ అయినా ఆ తరువాత సినిమా చేసే విషయంలో ఆయన ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. ముందు సినిమా హిట్ అయింది కదా అని ఆ తరువాత ప్రాజెక్టు విషయంలో కేర్ లెస్ గా ఉండటం .. ముందు సినిమా ఫ్లాప్ అయితే ఆ తరువాత చేసే సినిమా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం ఆయనకి అలవాటు లేని పని. కథ వినడం .. నచ్చితే చేసుకుంటూ వెళ్లిపోవడం ఆయన నైజం. ఏ విషయాన్ని కూడా నాన్చడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు.

బాలకృష్ణ లైనప్ చూస్తే యంగ్ హీరోలతో ఆయన ఏ స్థాయిలో పోటీపడుతున్నారనే విషయం అర్థమవుతుంది. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' చేసిన ఆయన, సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తరువాత సినిమాను ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఆయన సరసన సందడి చేయనుంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడి తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఒక వైపు నుంచి అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక గతంలో బాలయ్యతో 'పైసా వసూల్' చేసిన పూరి, ఆ సినిమాలో ఆయనను మరింత స్టైలీష్ గా చూపించి మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఇటీవల ఆయన బాలయ్యకి ఒక కథ చెప్పడం .. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని అంటున్నారు. ఇక కొరటాల .. పరశురామ్ .. మల్లిడి వేణు .. వెంకీ అట్లూరి వీరంతా కూడా బాలయ్య తో సినిమా చేయాలనే పట్టుదలతో, ఆయా కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ కథలకి ఒక రూపం రాగానే వాళ్లు ఆయనను కలిసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.

ఇక ఈ జనరేషన్ దర్శకుల సంగతి అలా ఉంచితే, ఇద్దరు సీనియర్ దర్శకులకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు సింగీతం శ్రీనివాసరావు అయితే .. మరొకరు రాఘవేంద్రరావు. గతంలో 'ఆదిత్య 369'తో బాలయ్యకి హిట్ ఇచ్చిన సింగీతం, 'ఆదిత్య 999' కథను వినిపించేసి ఆయన నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక 'రామానుజాచార్య' సినిమాను బాలయ్యతో చేయాలనే ఉద్దేశంతో రాఘవేంద్రరావు ఉన్నారట. ఈ ఇద్దరిలో ఎవరితో ముందుగా బాలయ్య సెట్స్ పైకి వెళతారా అనేది ఆసక్తిగరంగా మారింది. ఈ జాబితా చూస్తుంటే మరో నాలుగేళ్ల పాటు బాలయ్య డేట్లు దొరకడం కష్టమేననే విషయం అర్థమైపోవడం లేదూ!