Begin typing your search above and press return to search.

చంద‌మామ‌పై ఈ గుస‌గుస‌లు నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   11 Jun 2021 2:30 AM GMT
చంద‌మామ‌పై ఈ గుస‌గుస‌లు నిజ‌మేనా?
X
పెళ్లి త‌ర్వాత కొన్ని మార‌తాయి. అలాంటి ఒక బ‌లీయ‌మైన శ‌క్తి కాజ‌ల్ ని ప్రేరేపిస్తోందిట‌.. వివ‌రాల్లోకి వెళితే.. అందాల చంద‌మామ కాజ‌ల్ ఇటీవ‌లే లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న ఫ్యామిలీ ఫ్రెండు గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట అన్యోన్య దాంప‌త్యంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కుముందు ఆచార్య సెట్లో గౌత‌మ్ కిచ్లుని మెగాస్టార్ కి ప‌రిచ‌యం చేసారు కాజ‌ల్.

ఇక‌పోతే కాజ‌ల్ త్వ‌ర‌లోనే రిటైర్ మెంట్ ప్లాన్ లో ఉన్నార‌ని త‌న హ‌బ్బీతో క‌లిసి ముంబైలోనే స్థిర‌ప‌డి అత‌డి వ్యాపారాల‌కు సాయం చేయ‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అందుకే సౌత్ లో ఎక్కువ‌గా న‌టించేందుకు ఆసక్తిని క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ట‌. అలాగే తెలుగు చిత్రీసీమ‌లో రెండు ద‌శాబ్ధాలుగా కాజ‌ల్ కెరీర్ సాగుతోంది. ఇక ఆఫ‌ర్లు కూడా త‌గ్గాయి. అందుకే ముంబై బేస్ లో స్థిర‌ప‌డేందుకే నిర్ణ‌యించుకుంద‌న్న క‌థ‌నాలొస్తున్నాయి. డిజైనర్ భర్తకు సహాయం చేయ‌డం హిందీ ప‌రిశ్ర‌మ‌కు చేరువ‌కావ‌డం త‌న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక హిందీ ప‌రిశ్ర‌మ‌కు చేరువ‌గా వెళ్లేందుకే అజయ్ దేవ్ గన్ తో ఖైదీ రీమేక్ స‌హా ఉమా అనే చిత్రానికి సంతకం చేసింద‌ట‌. తెలుగులో ఆచార్య‌.. త‌మిళంలో భార‌తీయుడు 2 మిన‌హా వేరే ఆఫ‌ర్లు ఏవీ లేవు. ఓటీటీలోనూ న‌టిస్తోంది. ఇక‌పై హిందీ వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు ఆస్కారం ఉంటుంద‌ని తెలుస్తోంది.