Begin typing your search above and press return to search.
డీసెంట్ పిక్ పోస్టు చేస్తే.. పాలిటిక్స్ అంటూ పరేషాన్ చేస్తున్నారే?
By: Tupaki Desk | 7 July 2021 4:38 AM GMTహీరోయిన్లకు ఉండే సౌలభ్యం హీరోలకు ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని.. గ్లామర్ ను ప్రదర్శించేందుకు అనువైన ఫ్లాట్ ఫాం హీరోయిన్లకు లభించింది. అవకాశాలు లేకున్నా.. సోషల్ మీడియాలో అదే పనిగా ట్రెండ్ కావటం ద్వారా.. పలువురిని ఆకర్షించే వీలుంది. అంత మాత్రానికే ఛాన్సులు వచ్చేస్తాయా? అని ప్రశ్నించొచ్చు. అవకాశాలు రాకపోవచ్చు.. ఫాలోవర్లు వేలాదిగా పెరిగిపోతే.. దాని మీద వచ్చే ఆదాయం చాలు కదా? ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు.. ట్రెండ్ అయ్యే వారికి బోలెడన్ని కొత్త అవకాశాలు తన్నుకొస్తున్నాయి.
దీంతో.. హీరోయిన్లు తమ గ్లామర్ టాలెంట్ ప్రదర్శనకు సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్న వైనం తెలిసిందే. ఆ అవకాశం నటులకు ఉండదు. ఈ కారణంగానే నటీమణుల గ్లామర్ పిక్ లతో అలరిస్తే.. నటులు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. తాజాగా.. సీనియర్ నటుడు జగపతి బాబు.. వైట్ కుర్తా.. పైజమా వేసుకొని చక్కటి ఫోటో దిగారు. ఈ ఫోటో చూసినంతనే.. దర్శకుల మదిలో కొత్త క్యారెక్టర్ మెదిలేలా ఆయన ఫోటో ఉంది.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ ఫోటోకు పలువురు కామెంట్లు పెట్టేస్తున్నారు. మరికొందరు.. రాజకీయాల్లోకి రానున్నారా? అంటూ క్వశ్చన్లు వేశారు. దీనికి స్పందించిన జగపతి బాబు.. ‘రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవటం లేదు’ అంటూ తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. చూస్తూ.. చూస్తూ ఇప్పుడున్న రాజకీయాల్లోకి జగపతిబాబు లాంటి మైండ్ సెట్ ఉన్న వారు ఎందుకు వస్తారు చెప్పండి? ఏదో సుబ్బరంగా వైట్ అండ్ వైట్ పిక్ పెడితే.. మ్యాన్లీ లుకింగ్ అంటూ రియాక్టు కాకుండా.. రాజకీయాల రొంపిలోకి లాగేయటం దుర్మార్గమే సమా.