Begin typing your search above and press return to search.

ఇవి పెళ్లి ఘ‌డియ‌లేనా? శ్రీ‌వారి సేవ‌లో న‌య‌న్?

By:  Tupaki Desk   |   25 Oct 2019 6:06 AM GMT
ఇవి పెళ్లి ఘ‌డియ‌లేనా? శ్రీ‌వారి సేవ‌లో న‌య‌న్?
X
న‌య‌న‌తార‌-విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఈ జంట‌కు సంబంధించి ఏదీ పూర్తి క్లారిటీ లేదు. ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకుంటున్నారా? అంటే పొంత‌న‌లేని స‌మాధానాలే వ‌స్తాయి గానీ... ఇద్ద‌రూ ఒక్క‌టే అని వాళ్ల తీరును బ‌ట్టి అర్ధం చేసుకోవాల్సిందే. నానుమ్ రౌడీదాన్ తో మొద‌లైన వీరి ప్రేమాయాణానికి ఇటీవ‌లే నాలుగేళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా విఘ్నేష్ శివ‌న్ త‌న‌దైన శైలిలో సినిమా గురించి.. ఆ ప్రేమ ప‌రిచ‌యం గురించి చెప్పుకొచ్చాడు. దీంతో అతి త్వ‌ర‌లోనే పెళ్లికి రెడీ అవుతున్న‌ట్లు మ‌రోసారి హింట్ ఇచ్చిన‌ట్లైంది.

తాజాగా ఈ ప్రేజంట తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించింది. ఉద‌యం విఐపీ విరామ స‌మ‌యంలో స్వామివారిని సేవించి ఈ జంట మొక్కు తీర్చింది. ఆ వెంక‌టేశ్వ‌ర స్వామిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ద‌ర్శించి జీవితంలో మంచి జ‌ర‌గాల‌ని కోరుకున్నార‌ట‌. అంత‌కు ముందు టీటీడీ ఆల‌య అధికారులు ఇరువురికి స్వాగ‌త ద‌ర్శ‌నం ఏర్పాటు చేసారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండపంలో వేద‌పండితుల ఆశీర్వ‌చ‌నాలు అందుకున్నారు. ఆల‌య అధికారులు ప‌ట్టు వ‌స్త్రాల‌తో స‌త్క‌రించి స్వామి వారి తీర్ధ ప్ర‌సాదాలు అంద‌జేసారు.

అనంత‌రం కాసేపు అభిమానుల‌కు సెల్ఫీలు ఇచ్చారు. వీరితో పాటు డ్ర‌మ్స్ శివ‌మ‌ణి కూడా శ్రీవారిని ద‌ర్శించుకున్నాడు. ఉద‌యం స‌మ‌యం కావ‌డంతో పెద్ద‌గా ప్లోటింగ్ కూడా లేదు. దీంతో అభిమానుల తాడికి న‌య‌న‌తార గుర‌వ్వ‌లేదు. నేడే న‌య‌న‌తార‌, విజ‌య్ జంట‌గా న‌టించిన బిగిల్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. తెలుగులో విజిల్ పేరుతో అనువాద‌మైంది. ప్ర‌స్తుతం న‌య‌త‌న‌తార ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ద‌ర్బార్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే మిలింద్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తోంది.