Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఇక‌పై అవి క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   9 Nov 2022 12:30 PM GMT
టాలీవుడ్ లో ఇక‌పై అవి క‌ష్ట‌మేనా?
X
'బాహుబ‌లి', RRR త‌రువాత తెలుగు సినిమాల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ ఆద‌ర‌ణ‌, క్రేజ్ పెరుగుతోంది. మ‌న సినిమా అంటే ఉత్త‌రాది వారు పోటీప‌డి మ‌రీ కొంటున్నారు. ఉత్త‌రాదిలో అనువ‌దిస్తూ అక్క‌డ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్ష‌కులు కూడా మ‌న సినిమాల‌కు బ్రహ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో ఉత్త‌రాదిలో మ‌న సినిమాల‌కు భారీ మార్కెట్ ప‌లుకుతోంది. దీంతో చాలా వ‌ర‌కు మేక‌ర్స్ కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం మొద‌లు పెడుతున్నారు.

చిన్న హీరో నుంచి స్టార్ హీరో వ‌ర‌కు ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు. అదే త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతూ భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ లు వేస్తున్నారు. పెరిగిన డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని స్ట్రెయిట్ క‌థ‌ల‌కే ప్ర‌ధాన్య‌త‌న నివ్వ‌డం మొద‌లు పెట్టారు. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన రీమేక్ సినిమాల్లో ఏవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో ఇకపై రీమేక్ సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌నే ఆలోచ‌న‌కు మేక‌ర్స్ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

కార‌ణం రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేసిన 'గాడ్ ఫాద‌ర్‌' ఇందుకు ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఓటీటీ ప్ర‌భావం పెర‌గిపోయిన నేప‌థ్యంలో ఇత‌ర భాష‌ల్లో సూప‌ర్ హిట్ అనిపించుకున్న సినిమాలు ఓటీటీల ద్వారా అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు చేరువ‌వుతున్నాయి. 'గాడ్ ఫాద‌ర్‌' మాతృక 'లూసీఫ‌ర్‌' కూడా ఈ మూవీ రీమేక్ చేయ‌డానికి ముందే ఓటీటీలోనూ, యూట్యూబ్ లోనూ వ‌చ్చేసింది.

ఓటీటీలోనూ, యూట్యూబ్ లోనూ ఈ మూవీని తెలుగు ప్రేక్ష‌కులు చూసేశారు. అలా చేసేసిన క‌థ‌ల‌ని మ‌ళ్లీ రీమేక్ లుగా చేస్తే ఎంత స్టార్స్ వున్నా స‌రే ప్రేక్ష‌కులు మ‌రో సారి అతే క‌థ‌ని థియేట‌ర్ల‌లో చూడ‌టానికి ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని 'గాడ్ ఫాద‌ర్‌'తో స్ప‌ష్ట‌మైంది. ఎంత మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌, న‌య‌నతార వంటి స్టార్ కాస్ట్ న‌టించినా చూసిన కథ‌నే మ‌ళ్లీ చూడ‌టానికి ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించి స్థాయిలో ఆకట్టుకోలేక‌పోయింది.

ఈ ఫ‌లితంతో టాలీవుడ్ మేక‌ర్స్ లో రీమేక్ ల ప‌ట్ల భారీ మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలుస్తోంది. ఆ కార‌ణంగానే ఇక‌పై రీమేక్ ల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని చాలా వ‌ర‌కు మేక‌ర్స్ , స్టార్స్ ఆలోచ‌న‌కు వ‌చ్చార‌ట‌. ఇక‌పై న‌చ్చిన సినిమా ల‌భిస్తే వాట‌ని డ‌బ్బింగ్ చేయాడానికే ఇష్ట‌ప‌డాల‌ని, రీమేక్ ల‌కు ఆస్కారం ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మంచిదే ఇలా చేస్తే మ‌రిన్ని కొత్త క‌థ‌లు, క‌థ‌కుల‌కు ఉపాది ల‌భిస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.