Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్ 2' కి మించి ప్లాన్ చేస్తున్నారా?
By: Tupaki Desk | 28 April 2022 2:30 AM GMTయావత్ దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన మూవీ `కేజీఎఫ్ 2`. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ ఎక్కడ వుంది? నిజంగానే రాఖీ అనే వ్యక్తి వున్నాడా? .. ఆ సమయంలో ఇలాగే జరిగిందా? అనే స్థాయిలో ఈ మూవీ గురించి ఆడియన్స్ గూగుల్ చేయడం మొదలు పెట్టారు. ఆ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసి భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది.
ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డుల్ని తిరగరాస్తోంది. ఇప్పటికే పలు రికార్డుల్ని తిరగరాసి సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో 900 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ మూవీ అవలీలగా 1000 కోట్ల మార్కుని చేరడం ఖాయం అని అంటున్నారు. రాఖీ పాత్రలో యాంగ్రీ యంగ్ మెన్ గా యష్ తనదైన స్టైల్ తో యాటిట్యూడ్ తో నటించిన తీరు, ప్రశాంత్ నీల్ టేకింగ్, హొంబలే ఫిలింస్ రాజీలేని మేకింగ్, రవి బాస్రూర్ నేపథ్య సంగీతం, భువన్ గౌడ టెర్రిఫిక్ ఫొటోగ్రఫీ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించేలా చేశాయి.
`కేజీఎఫ్ 2` సాధిస్తున్న సంచలన విజయం నేపథ్యంలో ఇప్పడు ప్రభాస్ నటిస్తున్న `సలార్` చిత్రం చర్చనీయాంశంగా మారుతోంది. మామూలు గన్ నే ఓ రేంజ్ లో పేల్చే షూటక్ కి ఏకే 47 ఇచ్చినట్టు యష్ నే ఈ రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఇంతకు మించిన స్థాయిలో చూపించడం ఖాయం అని అంటున్నారు. గత రెండేళ్లుగా భారీ సినరిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 పండగ లాంటి వాతావరణాన్ని అందించాయి. అంచనాలకు మించి ఈ సినిమాలు వుండటంతో దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నాయి.
దీంతో ఈ రెండు చిత్రాల తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని మరింత సర్ ప్రైజ్‌ని `సలార్` మాత్రమే అందిస్తుందని చాలా మంది సినీ ప్రియులు, అభిమానులు చెప్పుకుంటున్నారు. `కేజీఎఫ్` సిరీస్ లో యష్ ని యాంగ్రీ యంగ్ మెన్ గా తగ చిత్రాలకు మించి పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు ప్రశాంత్ నీల్. అంతకు మించిన స్థాయిలో `సలార్` లో ప్రభాస్ ని చూపించే అవకాశం వుందని, స్టోరీ డిమాండ్ మేరకు ప్రభాస్ పాత్ర మరింత ఫెరోషియస్ గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ అంచనాలని దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ నీల్ ఈ మూవీ కోసం ఓ టెర్రిఫిక్ యాక్షన్ సీక్వెన్స్ ని దాదాపు 20 కోట్ల ఖర్చుతో ఇంటర్వెల్ సీన్ ని హాలీవుడ్ టెక్నీషియన్ లతో తెరకెక్కించాడని చెబుతున్నారు. ఒక్క ఇంటర్వెల్ సీన్ నే ఈ రేంజ్ లో తెరకెక్కిస్తే సినిమాని, అందులో ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపించి వుంటాడో అన్నది ప్రేక్షకులు, అభిమానులు ఓ అంచనాకు వస్తున్నారు. ఇదే గనక నిజమైతే నెవర్ బిఫోర్ యాక్షన్ మూవీ `సలార్` రూపంలో ప్రేక్షకులకు కనువిందు చేయనుందన్నమాటే.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హాలీవుడ్ మార్వెట్ మూవీస్ తరహాలో కేజీఎఫ్ ని సలార్ ని కలిపి సరికొత్త హీరోయిక్ మూవీని సరికొత్త నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఆవిష్కరించే అవకాశాలు కూడా లేకపోలేదని మరో వాదన వినిపిస్తోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న `సలార్` ని `కేజీఎఫ్` తరహాలోనే రెండు భాగాలుగా చేయబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. కానీ దర్శకుడు మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతున్నాడు.