Begin typing your search above and press return to search.

పెళ్లంటే ఆ భామ‌లు చిరాకు ప‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   21 Nov 2022 5:30 PM GMT
పెళ్లంటే ఆ భామ‌లు చిరాకు ప‌డుతున్నారా?
X
సీనియ‌ర్ హీరోయిన్లు అనుష్క‌...త్రిష‌... నిత్యామీన‌న్..శ్రుతి హాస‌న్..ఛార్మీ ల పెళ్లి అంశం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఛార్మీ మిన‌హా మిగ‌తా వారంతా వెండి తెర‌ను ఏల్తోన్న వారే. కొంత కాలంగా అనుష్క సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. కుటుంబ స‌భ్యుల‌తోనే స‌మ‌యాన్ని గడుపుతోంది. సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా? నో ఇంట్రెస్ట్ అనేస్తుంది.

మ‌న‌సుకు బాగా న‌చ్చితే త‌ప్ప క‌మిట్ అవ్వ‌డం లేదు. ఇక ఈ బ్యూటీ పెళ్లి గురించి వైర‌ల్ అయిన క‌థ‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇదిగో పులి అదిగో తోక అన్న చందంగా మీడియా ప్ర‌చారం త‌ప్ప ఇంకా వ‌రుడు ఎవ‌రు? అన్న‌ది ఖ‌రారు కాలేదు. అటు సినిమాలు చేయ‌లేదు..ఇటు పెళ్లి చేసుకోలేదంటూ ఒకటే మీడియా ఒత్తిడి.

ఇక అందాల త్రిష పెళ్లి జీవితం గురించి చేప్పేదేముంది? గ‌తంలో బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌నియ‌న్ తో నిశ్చితార్ధం క్యాన్సిల్ అయిన ద‌గ్గ‌ర నుంచి అమ్మ‌డిపై ఎలాంటి గాసిప్స్కూడా రాలేదు. పెళ్లి గురించి ప‌లుమార్లు ప్ర‌శ్నించిన త‌న మ‌న‌సును..మ‌నిషిని అర్ధంచేసుకునే వాడు దొరికితే చేసుకుంటాను అంటోంది త‌ప్ప ఆగ‌డియ‌లు ఇంకా రాలేదు.

ఇటీవ‌లే ఓ నెటిజ‌నుడు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా అసంతృప్తిని వ్య‌క్తంచేసింది. నా ఎళ్లి గురించి నీకెందుకు తొంద‌రా అంటూ గుసాయించింది. అలాగే హాట్ బ్యూటీ నిత్యామీన‌న్ వివాహం విష‌యంలో వీళ్లిద్ద‌రికి పోటీగా నిలుస్తుంది. పెళ్లి గిళ్లీ జాన్తా న‌య్ ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అంటూ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లి చేసుకోవ‌డం క‌న్నా కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి ఒక‌ర్నిఒక‌రు అర్ధం చేసుకున్న త‌ర్వాత వివాహ బంధం వ‌ర‌కూ వెళ్తే ఉత్త‌మం అన్న‌ది అమ్మ‌డి అభిప్రాయం.

మ‌రి నిత్య ఆ ప్ర‌కారం ముందుకెళ్తుందా? లేక త‌ల్లిదండ్రుల మాట‌కు క‌ట్టుబ‌డుతుందా? అన్న‌ది చూడాలి. ఈ బ్యూటీ వ‌ద్ద పెళ్లి గురించి ప్ర‌స్తావిస్తే మాత్రం క‌సుబుస్సు లాడుతుంది. ఇక శ్రుతిహాస‌న్ కూడా పెళ్లి కంటే ముందు కెరీర్ పై నే ఫోక‌స్ పెట్టి ముంద‌కెళ్తుంది. ఒక‌సారి ల‌వ్ లో ప‌డి స‌మ‌యాన్ని వృద్ధా చేసుకునే స‌రికి అమ్మ‌డికి కెరీర్ విలువ తెలుసొచ్చింది.

ప్ర‌స్తుతం శంత‌నుహ‌జారికాతో రిలేష‌న్ షిప్ లో ఉన్నా కెరీర్ ని మాత్రం సీరియ‌స్ గా తీసుకునే ముందుకెళ్తోంది. మ‌రి తాజా రిలేష‌న్ షిప్ని వివాహం వ‌ర‌కూ తీసుకెళ్తుందా? లేదా? అన్న‌ది కాలం నిర్ణ‌యించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.