Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు ల‌వ్ లో ఉన్నారా?

By:  Tupaki Desk   |   14 July 2022 11:30 PM GMT
ఆ ఇద్ద‌రు ల‌వ్ లో ఉన్నారా?
X
ఆ హీరో తెలుగు వారే. కానీ కోలీవుడ్ లో ఫేమ‌స్ అయ్యారు. ఆయ‌న అక్క‌డ హీరోల‌తోనే ఎక్కువ‌గా పోటీ ప‌డుతుంటారు. అలాగని మాతృ భాష‌ని వ‌దిలేసారు అని కాదు. త‌ప్ప‌కుండా అనువాద రూపంలో ఆయ‌న ప్రతీ సినిమా ఇక్క‌డా రిలీజ్ అవుతుంది. యాక్ష‌న్ స్టార్ గా రెండు భాష‌ల్లోనూ మంచి పేరు సంపాదించాడు. ఇక వ్య‌క్తిగ‌తంగాను ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన న‌టుడు.

సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాడు. మాన‌వ‌త్వానికి మ‌రో రూపంలా క‌నిపిస్తాడు. అంత‌గా అత‌ను రెండు భాష‌ల్లోనూ వ్య‌క్తిగ‌తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి న‌టుడు తెలుగులోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తే బాగుండు అని ప్ర‌తీ అభిమాని కోరుకుంటాడు. అంత‌గా అత‌ను తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌కి ద‌గ్గ‌ర‌య్యారు.

ఆ మ‌ధ్య ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్ధం కూడా ఎంతో గ్రాండ్ గా జ‌రిగింది. కానీ ఎందుక‌నో అది మ‌ధ్య‌లోనే బ్రేక్ అయింది. పెళ్లి చేసుకోవ‌డ‌మే త‌రువాయి తంతు అనుకుంటోన్న స‌మ‌యంలో ఆ బంధం అక్క‌డితో వీగిపోయింది. దీంతో అభిమానులు నిరుత్సాహ ప‌డ్డారు. ఏమై? ఉంటుంద‌ని ఆరాలు తీసినా స‌రైన బ‌ధులు దొర‌క‌లేదు. ఇదంతా గ‌తం. మ‌రి వ‌ర్త‌మానం ఏంటి?

అంటే? ఆ హీరో ఇప్పుడు మ‌రో హీరోయిన్ తో ల‌వ్ లో ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. రెండు నెల‌ల క్రిత‌మే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని త‌మిళ వ‌ర్గాలు అంటున్నాయి. కొన్నాళ్ల పాటు రిలేష‌న్ షిప్ కొన‌సాగించాక. .అంతా స‌వ్యంగా సాగితే తుది త‌గా పెళ్లి పై ఓ ఆలోచ‌న‌కి వ‌స్తార‌ని స‌మాచారం.

తొంద‌ర‌ప‌డి పెళ్లి చేసుకుని గొడ‌వ‌లు ప‌డ‌టం క‌న్నా...ముందే ఒక‌ర్ని ఒక‌రు అర్ధం చేసు కుంటే భ‌విష్య‌త్ లో మ‌న‌స్ప‌ర్ధ‌ల‌కు దారి ఇచ్చిన‌ట్లు ఉండ‌ద‌ని భావిస్తున్నారుట‌. ఇక ఆ హీరోయిన్ గురించి చెప్పాల్సి వ‌స్తే? అదీ పెద్ద క‌థే అని చెప్పాలి. కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. దాదాపు ఇక్క‌డ స్టార్ హీరోలంద‌ర్నీ క‌వ‌ర్ చేసింది. వ‌య‌సు 40కి ద‌గ్గ‌ర్లో ఉంది.

అయినా అమ్మ‌డు జోరు ఏం త‌గ్గ‌లేదు. కోలీవుడ్ లో ఇంకా స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తుంది. కెరీర్ చ‌ర‌మాంకానికి చేరుకుంటుంద‌ని భావించిన అమ్మ‌డు ఓ బిజినెస్ మ్యాన్ తో కొన్నాళ్లు ప్రేమ‌ను నెరిపి దాన్ని పెళ్లి పీఠ‌ల వ‌ర‌కూ కూడా తీసుకెళ్లింది. గ్రాండ్ గా నిశ్చితార్ధం కూడా జ‌రిగింది.

రేపో మాపో పెళ్లికి ముహూర్తం పెట్ట‌బోయారు. ఇంత‌లో బ్లాస్టింగ్. మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయి...నిశ్చితార్ధంతో వ‌చ్చిన గ్యాప్ మ‌రింత ఆజ్యం పోసింది. దీంతో ఆ బంధం అక్క‌డితో ర‌ద్ద‌యింది. ఈ నేప‌థ్యంలో ఆ సీనియ‌ర్ భామ కొన్నాళ్ల పాటు కెవ‌లం వృత్తిపైనే దృష్టి పెట్టింది. ప్రేమ..రిలేష‌న్ షిప్ ల‌కు దూరంగా ఉంది.

అయితే మ‌ళ్లీ మ‌న‌సు ప్రేమ‌..పెళ్లి అంటూ ప‌రుగులు తీస్తుందో ఏమో! అత‌గాడి ల‌వ్ లో ప‌డింద‌ని గుస గుస వినిపిస్తుంది. ఇద్ద‌రు అనుభ‌వ‌జ్ఞులే కాబ‌ట్టి క‌లిసి ప్ర‌యాణం చేసిన త‌ర్వాత పెళ్లి విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.