Begin typing your search above and press return to search.
టాలీవుడ్ స్టార్స్ అనిరుధ్ వెంటపడుతున్నారా?
By: Tupaki Desk | 16 July 2022 6:37 AM GMTయూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు. 1986లో వచ్చిన 'విక్రమ్'కు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు. కమల్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత చేసిన సినిమా ఇది. బ్లాక్ స్క్వాడ్ ఫార్ములా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ కమల్ కు బిగ్ కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరేష్ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతే కాకుండా వసూళ్ల పరంగానూ కమల్ నటించిన చిత్రాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కమల్ హాసన్ క్యారెక్టర్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన తీరు, విజయ్ సేతుపతి, ఫహద్ ల నటన, అంతే కాకుండా క్లైమాక్స్ చివర్లో రోలెక్స్ పాత్రలో మెరిన సూర్య క్యారెక్టర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నింటికీ మించి ఈ మూవీకి యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ప్రతీ ఒక్కరినీ కట్టిపడేసింది.
సీనియర్ గా సాగే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతమే ప్రధాన బలంగా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అనడంతో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సన్నివేశాన్ని అనిరుధ్ తనదైన స్టైల్ బీజీఎమ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు.
కమల్ కనిపించే సన్నివేశాలు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ సీన్స్ మరింతగా ఎలివేట్ అయి సినిమాపై ఇంపాక్ట్ ని కలిగించాయంటే అది అనిరుధ్ చేసిన మ్యాజికే. కమల్ , విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరేష్, సూర్య వంటి స్టార్స్ వున్నా ఆ పాత్రలని తన బిజీఎమ్స్ తో ఓ రేంజ్ లో హైలైట్ చేయడంతో అనిరుధ్ నూటికి నూరు శాతం విజయం సాధించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు.
ఇదే ఇప్పడు మన టాలీవుడ్ స్టార్స్ ని ఫిదా చేస్తోందట. 'విక్రమ్' కు అనిరుధ్ అందించిన బీజిఎమ్ నెక్స్ట్ లెవెల్ లో వుందని, ఆ స్థాయి బ్యాగ్రౌండ్ స్కోర్ మని సినిమాలకు కూడా కావాలని స్టార్ హీరోలు ఆలోచిస్తున్నారట. ఇంతకు ముందు టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోని కదిలించినా దేవి, తమన్ కావాలనే వారు కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరిని పక్కన పెట్టి అనిరుధ్ వెంటపడుతున్నారట. తనే కావాలని కోరుకుంటున్నారట. డైరెక్టర్లకు అనిరుధ్ పేరునే రిఫర్ చేస్తున్నారట.
తమన్ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం తను వున్న బిజీలో ఆశించిన స్థాయి బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించలేకపోతున్నాడని, బిజిఎమ్స్ విషయంలో తను అప్ డేట్ కావాల్సిన అవసరం ఎంతో వుందని చెబుతున్నారట. ఇక దేవి శ్రీప్రసాద్ గురించి అయితే అతను గత పదేళ్లుగా అదే తరహా సంగీతాన్ని అందిస్తున్నాడే కానీ అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఓపెన్ గానే చెప్పేస్తున్నారట. తాజా పరిస్థితిని బట్టి చూస్తే దేవి, తమన్ లని పక్కన పెట్టి టాలీవుడ్ స్టార్స్ ఇక నుంచి అనిరుధ్ కే తొలి ప్రధాన్యత ఇచ్చేలా వున్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా టాలీవుడ్ ని ఏలేస్తున్న దేవి, తమన్ లకు 'విక్రమ్'తో అనిరుధ్ బిగ్ షాకిచ్చాడన్నమాట.