Begin typing your search above and press return to search.

మరో సెలబ్రెటీ కపుల్‌ మ్యారేజ్ చూడబోతున్నామా?

By:  Tupaki Desk   |   14 Feb 2022 7:56 AM GMT
మరో సెలబ్రెటీ కపుల్‌ మ్యారేజ్ చూడబోతున్నామా?
X
ఈమద్య కాలంలో సెలబ్రిటీ కపుల్ ప్రేమ వ్యవహారాలు.. పెళ్లి చాలా కామన్‌ అయ్యింది. ప్రేమించి విడిపోతున్న వారి కంటే ప్రేమించి ఒక్కటి అవుతున్న వారే ఈమద్య ఎక్కువ మంది ఉన్నారు. గతంలో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఇండస్ట్రీలో తక్కువ అనే విమర్శలు ఉండేవి. కాని ఇప్పుడు అలా కాదు. ఒకసారి ప్రేమిస్తే ఆ వ్యక్తినే పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వరుస సెలబ్రెటీ పెళ్లిలు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీఫుల్‌ లవ్‌ జంట కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్‌ లు పెళ్ల చేసుకున్న విషయం తెల్సిందే. అందుకు ముందు బాలీవుడ్‌ స్టార్స్ దీపిక పదుకునే మరియు రణ్వీర్‌ సింగ్ ఇంకా కొందరు పెళ్లి పీఠలు ఎక్కారు. ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌ లో కూడా ఈ ప్రేమ వ్యవహారాలు కామన్‌ అయ్యాయి. ఈ సమయంలో తమిళంకు చెందిన జంట ఏకం అవ్వబోతున్నారు.

తమిళ సీనియర్ స్టార్‌ హీరో కార్తీక్‌ తనయుడు అయిన గౌతమ్ కార్తీక్‌ ప్రేమలో ఉన్నాడు. అతడు హీరోయిన్‌ మంజిమా మోహన్ తో ప్రేమలో ఉన్నాడు. ఆ విషయం ఇప్పటికి కూడా అధికారికంగా బయటకు రాలేదు. కాని తమిళ మీడియా వర్గాలు మాత్రం గౌతమ్ కార్తీక్ మరియు మంజిమా ల ప్రేమ వ్యవహారం గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు రాస్తూ దేశ వ్యాప్తంగా వీరి జోడీని మరింత పాపులర్ చేస్తున్నారు.

హీరోయిన్‌ గా పలు సినిమాలు చేసిన మంజిమా మోహన్‌ తో గౌతమ్ కార్తీక్‌ మొదటి సారి 2019 సంవత్సరంలో దేవరట్టం అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా సందర్బంగా ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం మొదలు అయ్యింది. ఆ ప్రేమ వ్యవహారం మూడు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులను కూడా వీరిద్దరు ఒప్పించారు.. త్వరలోనే వీరి ప్రేమ కాస్త పెళ్లి పీఠల వరకు వెళ్తుందనే వార్తలు తమిళ మీడియాల్లో వస్తున్నాయి.

గౌతమ్ కార్తీక్ హీరోగా మణిరత్నం సినిమా కడలి తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. తమిళంలో మెల్ల మెల్లగా కెరీర్‌ ను సెటిల్‌ చేసుకుంటున్న గౌతమ్‌ కార్తీక్‌ ఈ సమయంలో ప్రేమ పెళ్లి అంటూ కెరీర్‌ పై దృష్టి పెట్టక పోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో గౌతమ్ కార్తీక్‌ కెరీర్‌ పై దృష్టి పెట్టాలంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

ఇప్పటికే కుటుంబ పెద్దలు కూడా ఒప్పుకున్న నేపథ్యంలో ఎవరేం అన్నా కూడా గౌతమ్ కార్తీక్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే వీరిద్దరి వివాహం జరుగబోతుంది. మంజిమా మోహన్ తెలుగు లో కూడా ఒక సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. నాగ చైతన్య హీరోగా వచ్చిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్ గా మంజిమా కనిపించింది. కాస్త బొద్దుగా ఉండి ముద్దుగా ఉండే మంజిమాతో జరుగబోతున్న గౌతమ్‌ కార్తీక్‌ పెళ్లిని అతి త్వరలోనే మనం చూడబోతున్నాం.