Begin typing your search above and press return to search.
SSMB28 కోసం ఆ టైటిల్ నే ఫైనల్ చేస్తున్నారా?
By: Tupaki Desk | 17 Oct 2022 2:30 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు పుష్కర కాలం తరువాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూశారు.
వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో మొదలైంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత త్రివిక్రమ్, మహేష్ ల కలయికలో రానున్న సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక చాలా ఏళ్ల విరామం తరువాత మహేష్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో చాలా ప్రత్యేకంగా వుంటుందని మేకర్స్ కూడా ప్రచారం చేస్తున్నారు.
ఫస్ట్ షెడ్యూల్ ని భారీ యాక్షన్ ఘట్టాలతో మొదలు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్ తో పాటు కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా అన్బు అరివుల నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. మొత్తానికి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది.
త్వరలో సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే ఇటీవల మహేష్ బాబు మదర్ ఇందిరా దేవి మృతి చెందడం, మహేష్ బాబు ప్రత్యేక ట్రీట్మెంట్ కోసం స్పెయిన్ వెళ్లడంతో తదుపరి షెడ్యూల్ కు బ్రేక్ పడింది.
మహేష్ స్పెయిన్ నుంచి తిరిగి రాగానే నవంబర్ నుంచి తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించనున్నారట. ఇదిలా వుంటే ఈ మూవీకి పలు క్రేజీ టైటిల్స్ ప్రచారం అవుతున్నాయి. అయితే దర్శకుడు త్రివిక్రమ్ కున్న 'అ' సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీకి 'అయోధ్యలో అర్జునుడు' అనే పవర్ ఫుల్ టైటిల్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేయాలనే ఆలోచనలో వున్నారని చెబుతున్నారు. సినిమాలో మహేష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా వుంటుందట. ఆ కారణంగానే ఈ మూవీకి 'అయోధ్యలో అర్జునుడు' అనే పవర్ ఫుల్ టైటిల్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.
ఇక ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని హారిక అండ్ హాసిని వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ పీఎస్ వినోద్, సంగీతం తమన్, ఫైట్స్ అన్బు అరివు, ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.