Begin typing your search above and press return to search.
'థాంక్యూ' డైలాగ్ ను చై-సామ్ విడాకులతో లింక్ చేస్తున్నారే..!
By: Tupaki Desk | 13 July 2022 10:10 AM GMTఅక్కినేని నాగ చైతన్య నటించిన "థాంక్యూ" మూవీ రిలీజ్ కు రెడీ అయింది. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మేకర్స్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
అభి అనే వ్యక్తి జీవితంలోని వివిధ దశలను 'థాంక్యూ' సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమైంది. ప్రేమ, బాధ, కోపం, సంతోషం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇందులోని ఒక డైలాగ్ ప్రత్యేకంగా నిలిచింది.
నాగచైతన్య వాయిస్ ఓవర్ లో 'ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్చగా వదిలేసే ప్రేమ గొప్పది' అనే డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఇది చైతూ నిజ జీవిత సంఘటనలను ప్రతిబింబించేలా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పరోక్షంగా సమంత ను టార్గెట్ చేసేలా ఉందని.. ఇదే కారణంతో తమ అభిమాన హీరో ఆమెను వదులుకున్నారని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ సమంతను కూడా ట్రైలర్ ను చూడమని ట్యాగ్ చేస్తున్నారు.
ఇంతకముందు 'థాంక్యూ' టీజర్ లో 'లైఫ్ లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను' 'నన్ను నేను సరి చేసుకోడానికి.. నేను చేస్తున్న ప్రయాణమే ఇది' వంటి డైలాగ్స్ కూడా సామ్ ను ఉద్దేశిస్తూ చెప్పినవే అని అన్నారు.
'నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్' అంటూ రానా దగ్గుబాటి కామెంట్ చేయడం నెటిజన్లకు మరింత ఉత్సాహమిచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లోని డైలాగ్ చైతూ మరోసారి తమ మాజీ భార్యతో విడిపోవడానికి గల కారణాన్ని వివరిస్తున్నారని అంటున్నారు
అయితే అభిమానులు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే.. చైతన్య తన సినిమాలతో ఎవరో ఒకరిని టార్గెట్ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. రియల్ లైఫ్ లో అందరితో సౌమ్యంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే చై.. ఒక సినిమా డైలాగ్ తో సామ్ ని ఎందుకు టార్గెట్ చేస్తాడు.
నాగచైతన్య - సమంత పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. వారి మధ్య ఏమి జరిగిందనేది ఇరు వర్గాలకు మాత్రమే తెలుసు. 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో డివోర్స్ పై చాలా పరిణతితో సమాధానమిచ్చారు. అలాంటి వ్యక్తి పగ పెంచుకుని, ఒక డైలాగ్ తో సమంతను టార్గెట్ చేస్తున్నారనడం కరెక్ట్ కాదు.
కాగా, 'ఏమాయ చేసావే' సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2021 అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వేర్వేరు దారుల్లో పయనిస్తున్నారు.