Begin typing your search above and press return to search.

ఇడియ‌ట్ తో మాస్ రాజా వార‌సుడి ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 6:50 AM GMT
ఇడియ‌ట్ తో మాస్ రాజా వార‌సుడి ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారా?
X
టాలీవుడ్ లో వార‌సుల హ‌వా ఎంతో కాలంగా కొన‌సాగుతోంది. క్రేజీ స్టార్ల‌ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ల‌లో అత్య‌ధిక శాతం హీరోలుగా రాణిస్తున్నారు. చిరు ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే వార‌సులు ప‌దుల సంఖ్య‌లో వుండ‌గా, నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు ముగ్గురు మాత్ర‌మే లైమ్ లైట్ లో వున్నారు. ఇక ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇద్ద‌రు హీరోలు వుండ‌గా మూడ‌వ హీరో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అక అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగ్ తో క‌లిపి ఐదుగురున్నారు.

ఇందులో నాగ్ త‌రువాత మిగ‌తా వారు స్టార్ స్టేట‌స్ కోసం పోటీప‌డుతున్నారు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇదిలా వుంటే మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫ్యామిలీ నుంచి కూడా వార‌సుడు తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్న‌డ‌ని, ర‌వితేజ కెరీర్ ని మ‌లుపు తిప్పిన 'ఇడియ‌ట్‌' మూవీకి ఇది సీక్వెల్ గా వుంటుంద‌ని, 'ఇడియ‌ట్ 2' పేరుతో ఈ మూవీని చేయ‌బోతున్నార‌ని ర‌క ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.

దాదాపు ఇర‌వై ఏళ్ల క్రితం 2002లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ 'ఇడియ‌ట్‌'. అప్ప‌ట్లో ఈ మూవీ ఏ స్థాయి సంచ‌ల‌నాల‌ని సృష్టించిందో, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు హీరోగా ఎలాంటి గుర్తింపుని తెచ్చి పెట్టిందో అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా 'ఇడియ‌ట్ 2' పేరుతో ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.ఈ వార్త‌ల‌పై తాజాగా జ‌రిగిన 'వాల్తేరు వీర‌య్య‌' ప్రెస్ మీట్ లో హీరో ర‌వితేజ స్పందించారు.

మీ అబ్బాయిని 'ఇడియ‌ట్ 2' సినిమాతో ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు? అని మీడియా అడిగితే ర‌వితేజ షాకింగ్ స‌మాధానం చెప్పాడు. అలాంటిదేమీ లేద‌ని, విన‌డానికే చాలా కొత్త‌గా వుంద‌ని ర‌వితేజ తెలిపారు. ఈ మాట‌లు విన్న మైత్రీ నిర్మాత ర‌విశంక‌ర్ 'త‌ను చాలా చిన్న‌వాడ‌ని' చెప్పుకొచ్చాడు. అంటే ర‌వితేజ త‌న‌యుడి ఎంట్రీకి ఇంకా టైముంద‌న్న‌మాట‌. ర‌వితేజ న‌టించిన 'రాజా ది గ్రేట్‌' మూవీలో ఆయ‌న త‌న‌యుడు మ‌హాధ‌న్ చిన్న‌నాటి మాస్ రాజా క్యారెక్ట‌ర్ లో క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.