Begin typing your search above and press return to search.
అలా కలల్లోకి జారుకుంటున్నావా రష్మిక?
By: Tupaki Desk | 25 Aug 2022 7:31 AM GMTరష్మిక మందన్న కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు టాలీవుడ్..బాలీవుడ్ అంటూ రెండు భాషల్ని దున్నేస్తుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. క్రేజీ బ్యూటీగా వెలిగిపోతున్నా ఆప్రీన్ లాంటి పాత్రల్లతోనూ తనదైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంది. 'సీతారామం' చిత్రంలో అమ్మడి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
'పుష్ప' తర్వాత రష్మిక సీతారామం రూపంలో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ కెరీర్ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తుంది. పుష్ప తో దక్కిన పాన్ ఇండియా క్రేజ్ ని తెలివిగా సద్వినియోగం చేసుకుంటుంది. మరోవైపు కమర్శియల్ యాడ్స్ లోనూ నటిస్తూ సంపాదిస్తుంది. అటు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం..ఇటు యాడ్స్ రూపంలో వచ్చే ఆదాయంతో భారీగానే ఆస్తులు కూడబెతుతుందని చెప్పొచ్చు.
తాజాగా ఇన్ స్టాలో ఓ ఫోటోని షేర్ చేసి అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఇందులో మందన్న వంటగదిలో కప్పు వేడి పానీయాన్ని ఆస్వాదిస్తూ కలల్లోకి జారుకుంటుంది. పాత జ్ఞాపకాల్ని నెమర వేసుకుంటుందా? భవిష్యత్ ని అందంగా ఊహించుకుంటుందా? అన్నది తెలియదుగానీ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోని ఉద్దేశించి రష్మిక ఇలా రాసుకొచ్చింది.
ఈ ఫోటో ఎప్పుడు చిత్రీకరించబడిందో నాకు నిజంగా గుర్తులేదు. కానీ నటిగా కాకుండా.. ఈ నాలుగు ఫోటోలు నన్ను నేనుగా వర్ణించాయని నేను భావిస్తున్నాను. ఆ ఫోటోలు వేయి పదాలు మాట్లాడగలవు. ఇప్పడదే జరుగుతుందనిపిస్తుంది. ఇవి ఎప్పుడు తీశారో నాకు గుర్తులేదు. కానీ వీటిని తీసినప్పుడు కలిగిన అనుభూతి నాకు గుర్తుంది అని అనుకుంటున్నాను.
అప్పుడు నేను ఎంత ప్రశాంతంగా..ఆరోగ్యంగా ఉన్నానో? అర్ధమవుతుంది. ఇప్పుడు వీటిని చూసుకుంటే చాలా వింతగా ఉంది' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప-2' లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో 'గుడ్ బై'.. 'మిషన్ మజ్ను'..'యానిమల్' చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే వీటిలో రెండు చిత్రాల షూటింగ్ పూర్తయింది. త్వరలో 'పుష్ప' షూట్ లో జాయిన్ అవుతుంది.