Begin typing your search above and press return to search.

నా ప్రాణం ఎక్కడ అంటున్న లోకల్ నాని

By:  Tupaki Desk   |   31 Jan 2017 5:10 AM GMT
నా ప్రాణం ఎక్కడ అంటున్న లోకల్ నాని
X
హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ 'నేను లోకల్' మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో యూనిట్ అంతా బిజిగా ఉన్నారు. వేరే చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడంతో.. దాదాపుగా నానికి సోలో రిలీజ్ లభించినట్లే. ఈ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ దగ్గర నానికి తన వసూళ్ల సత్తా చాటే అవకాశం మరోసారి లభించినట్లయింది.

ఇటు ఇంటర్వ్యూల హంగామాతో పాటు.. మరోవైపు యూట్యూబ్ లో కూడా ప్రచార హోరు బాగానే ఉంది. తాజాగా ఈ నేచురల్ స్టార్ నటించిన మూవీలోంచి 'అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం.. దానికి నువ్వేలే సమాధానం' అంటూ సాగే పాటకు ప్రోమోను రిలీజ్ చేశారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఏ మాత్రం తగ్గకుండా.. తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం.. నీతో గడిపే నిమిషమే అంటూ మంచి ఆన్సరే ఇచ్చింది. లిరికల్ గానే కాదు.. మ్యూజికల్ గా కూడా బాగా ఆకట్టుకుంది ఈ సాంగ్.

మరోవైపు ఈ పాటకు విజువల్స్ ప్రాణం పోసేశాయి. అందమైన చూడముచ్చటగా మళ్లీ మళ్లీ చూడాలని అనిపించే లొకేషన్స్ ను ఎంచుకుని మరీ షూట్ చేశాడు దర్శకుడు త్రినాథ రావు నక్కిన. తొలిసారిగా నాని మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సూపర్బ్ గా ఉంది. ఒక్క పాటతోనే అంచనాలు రెట్టింపు అయిపోయాయంటే.. ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు టెక్నిక్స్ అర్ధమవుతాయి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/