Begin typing your search above and press return to search.
ముక్కు అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటో పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది
By: Tupaki Desk | 2 Sep 2021 4:14 AM GMTవివాదాలు.. విమర్శల మాట ఎలా ఉన్నా.. ఎంతోమంది కమెడియన్లకు ఉపాధిని ఇవ్వటమే కాదు.. వారంతా సెలబ్రిటీలుగా మారటానికి.. చక్కగా సంపాదించుకొని సెటిల్ కావటానికి జబర్దస్త్ ప్రోగ్రాం ఎంతగానో సాయం చేసిందని చెప్పాలి. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ను పోలిన స్కిట్లు చాలానే చానళ్లు ఇప్పుడు ఫాలో కావటం తెలిసిందే. జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో గత బిగ్ బాస్ సీజన్ లో సడన్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్.. ఎంతలా ఆకట్టుకున్నాడో తెలిసిందే. తాజాగా ఒక ఇంటివాడు అవుతున్న అతడు.. తాను పెళ్లి చేసుకోన్న అమ్మాయితో ఉన్న తన ఎంగేజ్ మెంట్ ఫోటోల్ని షేర్ చేయటం తెలిసిందే.
తాజాగా ఆ ఫోటోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ పాత విషయాల్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. గత సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో ముక్కు అవినాష్.. అరియానా మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందన్న భావన కలగటం.. హౌస్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఇద్దరు చనువుగా ఉంటూ.. తిరగటంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందన్న వాదనలు మొదలై.. వార్తల వరకు వచ్చాయి.
తాజాగా అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటోను పోస్టు చేసిన అరియానా.. ‘మా మధ్యన ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. తను నాకు మంచి మిత్రుడు మాత్రమే.అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. తాజా స్టోరీతో అయినా సరే అనవసర ప్రచారానికి చెక్ పెట్టాలన్నదే అరియానా ఆలోచనగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఏమైనా.. మిగిలిన వారికి భిన్నంగా తన మీద జరుగుతున్న ప్రచారానికి తనదైన శైలిలో అరియానా క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి.