Begin typing your search above and press return to search.
38 ఇయర్స్ ఇండస్ట్రీ-నేనే భయపడితే ఎలా?
By: Tupaki Desk | 6 Aug 2018 5:51 AM GMTయాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్న అర్జున్ సౌత్ అంతా పాపులారిటీ ఉన్న కథానాయకుల్లో ఒకరు. సీనియర్ హీరో అయినా అదే ఛార్మ్ మెయిన్ టైన్ చేస్తూ విశాల్ హీరోగా తెరకెక్కిన 'అభిమన్యుడు' లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేస్తున్నాడు. ఈమధ్య అర్జున్ ఫిలిం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయిన క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించాడు.
అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తన కెరీర్ ను ఎంచుకొని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి ఐదేళ్ళు అయిందట. మరి ఓ తండ్రిగా అర్జున్ ఈ క్యాస్టింగ్ కౌచ్ ఏమంటాడు? "నేను 38 ఏళ్ళుగా పనిచేస్తున్న ఇండస్ట్రీ గురించి నేనెందుకు భయపడాలి? అసలు నేనే భయపడితే ఇతర తల్లిదండ్రులు వాళ్ళ అమ్మయిలను ఇండస్ట్రీ కి ఎలా పంపుతారు? సినిమా ఇండస్ట్రీపై కొంత చెడు అభిప్రాయం ఉంది కానీ క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల, అన్ని ఇండస్ట్రీల్లో ఉంది."
మంచి చెడులు అన్ని చోట్ల పక్కపక్కనే ఉంటాయని, వాటిలో ఏది స్వీకరించాలనే నిర్ణయం వ్యక్తిగతమని చెప్పాడు. ఒకరు కనుక సరైన మార్గంలో పయనించాలని నిర్ణయం తీసుకుంటే వాళ్ళని ఆపేవారు ఎవరు ఉండరని కుండబద్దలు కొట్టాడు. హిపోక్రసీతో వ్యవహరించే చాలామంది కంటే అర్జున్ ఓ జెంటిల్మేన్ లాగా తన అభిప్రాయం చెప్పాడు కదా. నిజమే.. ఇండస్ట్రీ లో ఉండేవారే అమ్మాయిలను ఇండస్ట్రీలో కెరీర్ వద్దని ఆపితే బయటవాళ్ళు ఎలా ధైర్యం చేయగలరు? మంచి లాజిక్కే!