Begin typing your search above and press return to search.

మ‌లైకా- అర్జున్‌.. ఇలా కోలుకోగానే అలా జంట షికార్లు

By:  Tupaki Desk   |   13 Oct 2020 2:30 AM GMT
మ‌లైకా- అర్జున్‌.. ఇలా కోలుకోగానే అలా జంట షికార్లు
X
కరోనా వైరస్ నుండి కోలుకున్న తరువాత అర్జున్ కపూర్ - మలైకా అరోరా జంట తొలి ఫోటోషూట్ తో వేడెక్కించారు. ఈ ఆదివారం మొదటిసారి కలిసి కనిపించారు. ఆ ఇద్దరిని క్లిక్ చేసేందుకు కెమెరా క‌న్ను పోటీప‌డింది. మలైకాను ఇంటి వద్ద దింపి అర్జున్ కార్ లో జంప్ అయ్యారు. అర్జున్ డ్రైవర్ సీట్లో ఉన్నా.. గ్లాసెస్ లోంచి పాక్షికంగా మాత్ర‌మే క‌నిపించ‌డంతో బ‌య‌టికి క‌నిపించడం క‌ష్ట‌మైంది.

అర్జున్ - మలైకా ఇద్ద‌రికీ ఒకే సమయంలో కోవిడ్ -19 పాజిటివ్ వ‌చ్చింది. ఇద్దరూ తమ ఇళ్లలోనే స్వీయ‌నిర్భందంలోకి వెళ్లారు. ఇద్దరూ ఇటీవల కోలుకుని దిగ్బంధం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. కొరోనావైరస్ నిర్ధారణ కారణంగా కొన్ని రోజులు దూరంగా ఉన్న తరువాత మలైకా డాన్స్ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డాన్సర్ లోపాల్గొనేందుకు వెళ్లారు. అర్జున్ కూడా తిరిగి సినిమాల‌తో బిజీ అవ్వాల‌నుంద‌ని కోరికను వ్యక్తం చేశాడు.

దీని గురించి తన శ్రేయోభిలాషులకు తెలియజేయడానికి అర్జున్ గత వారం ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టింగు పెట్టాడు. “ నేను పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత .. పనిలో తిరిగి చేర‌డానికి సిద్ధ‌మ‌వుతున్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని వ్యాఖ్యానించారు. ``వైరస్ తీవ్రంగా ఉంది.. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని సీరియ‌స్ గా పరిగణించాలని నేను కోరుతున్నాను. కరోనావైరస్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందని ప్రజలు అర్థం చేసుకోవాలి. యువకులు మరియు పెద్దవారు జాగ్ర‌త్త‌. దయచేసి అన్నివేళ‌లా ముసుగును ధరించండి! BMC సాయానికి ధన్యవాదాలు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రతిదీ పణంగా పెడుతున్న ఫ్రంట్ ‌లైన్ కార్మికులకు వందనం. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము`` అని ట్వీట్ చేశాడు. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే ఈ జంట దాట‌వేసింది. 2021లో అయినా అందుకు అడుగులు వేస్తారా? అంటే అ‌ది బిలియ‌న్ డాల‌ర్ క్వ‌శ్చ‌న్ మార్క్.