Begin typing your search above and press return to search.
నా పేరు సూర్యలో తండ్రి ఎవరు?
By: Tupaki Desk | 25 Jan 2018 7:03 AM GMTమెగా హీరో అల్లు అర్జున్ కొత్త సినిమా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ఇందులో అల్లు అర్జున్ తో పాటూ కీలక పాత్రలకు పెద్ద నటీ నటులనే పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మిగతా పాత్రల కన్నా అర్జున్ తండ్రి రోల్ ఎవరు చేశారనేదే సస్సెన్స్. ఇప్పుడిక ఆ సస్సెన్స్ వీడినట్టే కనిపిస్తోంది.
నా పేరు సూర్యలో.. హీరో తరువాత హీరో తండ్రి పాత్రకు మంచి ప్రాముఖ్యతే ఉందట కథలో. సో మరి ఆ పాత్రకు ఎవరిని తీసుకున్నారో తెలుసా? మనకు తెలిసిన సమాచారం ప్రకారం... ఒకప్పటి హీరో అర్జున్. అదేనండి జెంటిల్ మేన్ - ఒకే ఒక్కడు - హనుమాన్ జంక్షన్ సినిమాల హీరో. ఆ మధ్య లై సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌కు తండ్రిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ గా రావు రమేష్ కనిపించబోతున్నాడట. ఇద్దరు అర్జున్ ల నటన ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా ఉంటుందేమో.
ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నాడట. అందుకే రిపబ్లిక్ డే నాడు సైనిక అనే పాటను కూడా విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్. వక్కంతం వంశీ స్వయంగా రాసి, డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బన్నీ పక్కన అను ఇమ్మాన్యుయేల్ మెరవబోతోంది.