Begin typing your search above and press return to search.

విల‌న్ ని హీరోగా ప్ర‌మోట్ చేస్తున్న శంక‌ర్‌!

By:  Tupaki Desk   |   19 Dec 2022 7:42 AM GMT
విల‌న్ ని హీరోగా ప్ర‌మోట్ చేస్తున్న శంక‌ర్‌!
X
ఖైదీ, మాస్ట‌ర్‌, విక్ర‌మ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌ల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న త‌మిళ న‌టుడు అర్జున్ దాస్‌. ప్ర‌స్తుతం సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ మ‌ల‌యాళ మూవీ 'క‌ప్పెల‌' ఆధారంగా తెలుగులో రీమేక్ చేస్తున్న 'బుట్ట‌బొమ్మ‌' మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

ఇందులోనూ నెగెటివ్ షేడ్స్ వున్న ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించబోతున్నాడు. కొన్ని సినిమాల్లో విల‌న్ గానూ న‌టించిన అర్జున్ దాస్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ హీరోగా ప్ర‌మోట్ చేస్తున్నాడు.

అర్జున్ దాస్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'అనీతి'. వ‌సంత బాల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో దుశ్శార విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ గురించి తెలుసుకున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్ స్వీయ నిర్మాణ సంస్థ ఎస్‌.

పిక్చ‌ర్స్ పై స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ముందుకొచ్చారు. ఆదివారంసోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ శంక‌ర్ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. దీనికి ఆస‌క్తిక‌రంగా త‌మిళంలో క్యాప్ష‌న్ ని కూడా జ‌త చేశారు.

రెడ్ క‌ల‌ర్ థీమ్ లో అర్జున్ దాస్ ర‌గ్గ్‌డ్ లుక్ లో క‌నిపిస్తూ చేతిలో ఆయుధంగా సీరియ‌స్ టోన్ లో వున్నాడు. ఈ లుక్ తో సినిమా సీరియ‌స్ టోన్ లో వుంటుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది. అర్బ‌న్ బోయ‌స్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై శంక‌ర్ ఎస్ పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ మూవీకి జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎడ్విన్ సాకే సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తున్నారు. స‌రికొత్త క‌థ‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ మూవీ సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

ది గ్రేట్ శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుడు త‌న సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌టుడు అర్జున్ దాస్ ఆనందం వ్య‌క్తం చేశాడు. త‌న కెరీర్ లో న‌టుడిగా త‌న‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వ‌మ‌ని, అదృష్ట‌మ‌ని దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ బ్యాన‌ర్ లో తాను న‌టించ‌డంతో త‌న క‌ల నిజ‌మైంద‌ని న‌టుడు అర్జున్ దాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌క్తం చేయ‌డం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.