Begin typing your search above and press return to search.
‘పద్మావతి’ అసలు రిలీజవుతుందా?
By: Tupaki Desk | 10 Nov 2017 5:04 AM GMTప్రస్తుతం బాలీవుడ్ దృష్టంతా ‘పద్మావతి’ సినిమా మీదే ఉంది. ‘బాహుబలి’కి దీటైన సినిమా అవుతుందని దీనిపై బోలెడు ఆశలతో ఉన్నారు బాలీవుడ్ జనాలు. ఐతే ఈ సినిమా డిసెంబరు 1న అనుకున్న ప్రకారం విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఐతే ఓ స్థాయి వరకు వివాదాలు మేలే చేస్తాయి. పబ్లిసిటీ తెచ్చిపెడతాయి. కానీ ‘పద్మావతి’ విషయంలో వివాదాలు కొంచెం శ్రుతి మించాయి. ఓ వర్గం వాళ్లు ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మీద భౌతిక దాడికి దిగారు. ఈ చిత్ర సెట్ ను తగులబెట్టేశారు. ఐతే ఆ అడ్డంకులన్నీ అధిగమించి సినిమా అయితే పూర్తి చేయగలిగాడు కానీ.. రిలీజ్ చేసుకోవడమే కష్టంగా మారుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండగా దీని మీద వివాదాలు మరింత శ్రుతి మించుతున్నాయి.
ఈ సినిమాను ఆడనిచ్చే ప్రసక్తే లేదని.. థియేటర్లను తగులబెడతామని ఇప్పటికే హెచ్చరికలు మొదలయ్యాయి. రాజస్థాన్ కు చెందిన ఓ వర్గం తాజాగా మరోసారి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్నప్తి చేసింది. మరోవైపు సెన్సార్ బోర్డు సభ్యుడు అర్జున్ గుప్తా.. ఈ చిత్ర దర్శకుడు బన్సాలీ మీద కేసు పెట్టాలంటూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన బన్సాలీ ఒక వీడియో ప్రకటన ద్వారా తన వాదన వినిపించాడు. తాను ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించలేదని.. ఎవరి మనోభావాలూ గాయపరిచేలా సినిమా తీయలేదని అన్నాడు. ఐతే పరిస్థితి చూస్తుంటే మాత్రం డిసెంబరు 1న ఈ సినిమా అనుకున్న ప్రకారం రిలీజవడం కష్టంగానే ఉంది.