Begin typing your search above and press return to search.

సహజీవనం చేస్తూ పెళ్లిపై మాత్రం మౌనం

By:  Tupaki Desk   |   30 May 2019 9:02 AM GMT
సహజీవనం చేస్తూ పెళ్లిపై మాత్రం మౌనం
X
బాలీవుడ్‌ ఐటెం బాంబ్‌ గా పేరు దక్కించుకున్న మలైకా అరోరా మరియు యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. అర్జున్‌ తో ప్రేమ వల్లే మలైకా తన భర్తకు విడాకులు ఇచ్చిందనే విషయం కూడా చర్చ జరుగుతోంది. భర్త నుండి విడిపోయిన తర్వాత మలైకా అరోరా తన ప్రేమ గురించి ఓపెన్‌ అవ్వడం మొదలు పెట్టింది. ఈమద్య కాలంలో ఇద్దరు బాహాటంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

గత కొన్నాళ్లుగా ముంబయిలో వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారు. కొన్ని వారాల క్రితం వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది.. పెద్దల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి జరుగబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు పుకార్లే అంటూ ఇద్దరు కొట్టి పారేశారు. పెళ్లి గురించి ప్రస్తుతంకు తనకు ఎలాంటి ఆలోచన లేదని అర్జున్‌ కపూర్‌ అంటున్నాడు. తాజాగా మరోసారి ఒక టాక్‌ షోలో అర్జున్‌ కపూర్‌ మాట్లాడుతూ పెళ్లికి ఇంకా సమయం ఉందని భావిస్తున్నాను.. నాకు పెళ్లి విషయంలో ఎలాంటి హడావుడి లేదంటూ చెప్పుకొచ్చాడు.

గత కొన్నాళ్లుగా సహజీవనం అయితే చేస్తున్నారు కాని పెళ్లి విషయం వచ్చేప్పటికి వీరిద్దరు కూడా మౌనం వహించడంతో అసలు వీరు పెళ్లి చేసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలిసి ఉన్నంత కాలం సహజీవనం సాగించి.. ఎప్పుడైతే విభేదాలు వస్తాయో అప్పుడు విడిపోవాలని భావిస్తున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో పెళ్లి చేసుకున్న మలైక అరోరా విడాకుల సమయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ కారణంగానే మళ్లీ పెళ్లి అంటే కాస్త వెనుకంజ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.