Begin typing your search above and press return to search.

కుర్ర‌హీరోతో మలైకా పెళ్లి తేదీ ఫిక్స్‌!

By:  Tupaki Desk   |   5 March 2019 12:09 PM GMT
కుర్ర‌హీరోతో మలైకా పెళ్లి తేదీ ఫిక్స్‌!
X
ఏడాది కాలంగా మ‌లైకా అరోరాఖాన్ - అర్జున్ క‌పూర్ ఎఫైర్ గురించి బాలీవుడ్ మీడియా వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో భ‌ర్త‌ ఆర్భాజ్ ఖాన్ కి విడుకులు ఇచ్చిన మ‌లైకా వ‌య‌సులో త‌న‌కంటే చాలా చిన్న‌వాడైన‌ అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ సాగించ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. త‌న‌కంటే ప‌దిహేనేళ్లు పెద్ద వ‌య‌సు ఉన్న మ‌లైకాను అత‌డు పెళ్లాడ‌బోతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా ఒక‌టే హీటెక్కించేస్తోంది. ఆ వార్త అటూ ఇటూ తిరిగి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ దావాన‌లంలా చుట్టేసింది.

ఇంత ప్ర‌చార‌మైనా.. మ‌లైకా- అర్జున్ క‌పూర్ జంట ఎఫైర్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఈ జంట‌కు క‌పూర్ ఫ్యామిలీ స‌పోర్ట్ ద‌క్క‌డంతో ఆ ఇద్ద‌రూ ఇంకా రెచ్చిపోవ‌డం మీడియా ముఖంగానే క‌నిపిస్తోంది. ప్ర‌ఖ్యాత క్వింట్ క‌థ‌నం ప్ర‌కారం.. మ‌లైకా అరోరాఖాన్ ని యువ‌హీరో అర్జున్ క‌పూర్ పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని, ఈ ఏప్రిల్ లోనే ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ జోడీ ఇప్ప‌టికే స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. ఇంకా వేచి చూసేది లేదు.. ఏప్రిల్ లో క్రిస్టియ‌న్ వెడ్డింగ్ స్టైల్లో పెళ్లాడుకోవాల‌ని అనుకుంటున్నార‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. పెళ్లికి ముందే ఈ జోడీ ఇప్ప‌టికే ముంబై- అంధేరిలోని అప్‌స్కేల్ లోఖండ్‌వాలా ఏరియాలో ఓ అపార్ట్ మెంట్ ని కొనుక్కున్నారు. పెళ్లి కాగానే అందులోనే కాపురం పెట్ట‌బోతోంద‌ని అడ్వాన్స్ డ్ గా క‌థ‌నాన్ని వండి వార్చింది క్వింట్.

మ‌లైకాతో అర్జున్ పెళ్లికి బోనీక‌పూర్ వ్య‌తిరేకంగా ఉన్నా.. వార‌సుడు త‌న రిలేష‌న్ షిప్ ని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణ‌యించుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు అర్జున్ స్పీడ్ పై స‌ల్మాన్ ఖాన్ - ఆర్భాజ్ ఖాన్ సోద‌ర ద్వ‌యం సీరియ‌స్ గానే ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఆ ఎఫైర్ వ‌ల్ల స‌ల్మాన్ - బోనీక‌పూర్ మ‌ధ్య ఉన్న సంబంధ‌బాంధ‌వ్యాలు చెడిపోయాయ‌న్న ప్ర‌చారం హోరెత్తిపోతోంది. ప్ర‌స్తుతం ఆర్భాజ్ ఖాన్ ఇటాలియ‌న్ మోడ‌ల్ జార్జియా ఆండ్రియానీతో ప‌బ్లిగ్గానే ఎఫైర్ సాగిస్తున్నాడు. ఆ ఫోటోలు ఇప్ప‌టికే జోరుగా వైర‌ల్ అయ్యాయి. ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో ఇలాంటివి చాలా స‌హ‌జం అని సౌత్ లో ఆస‌క్తిగా చ‌ర్చించుకోవ‌డం విశేషం.