Begin typing your search above and press return to search.
పెళ్లిలోనూ జంటగా ఛయ్య ఛయ్యా!!
By: Tupaki Desk | 10 Dec 2018 10:56 AM GMTపెళ్లంటే మజాకానా? చాలా ముందుగానే ముందస్తు ప్రిపరేషన్ అవసరం. ఇలా వెళ్లి అలా తాళి కట్టేస్తామంటే ఏ బ్యాచిలర్‌కి అయినా అదేమీ అంత సులువైన టాస్క్ కాదు. ఈ విషయాన్ని చాలా ముందే గ్రహించాడు ఈ బుల్లోడు. అందుకే ఇలా ఏ పెళ్లిని వదలకుండా చాలా ముందస్తు ప్రిపరేషన్లోనే ఉన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాని కదిలించినా, కదిలించకపోయినా ఒకటే ఊకదంపుడు. కాబోయే ఈ జంట పెళ్లి ప్రిపరేషన్ ఇలా ఉంది గురూ! అంటూ దంచేస్తోంది.
40 ప్లస్ మలైకా అరోరాఖాన్‌తో పాతిక ప్రాయం బుల్లోడు అర్జున్ కపూర్ షికార్లు ముంబై నగరాన్ని వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ జంట ఓపెన్‌గానే షికార్లు చేస్తుండడంతో మీడియా ఫోకస్ అంతా వీళ్లపైనే పడింది. చీమ చిటుక్కుమన్నా.. ఆకు ఫటక్కుమన్నా ఈ జంట పెళ్లికి రెడీ అవుతోందంటూ కథనాలు అల్లేస్తోంది. అంతగా ఆ ఇద్దరినీ మీడియా కళ్లు వెంటాడుతున్నాయి. అయినా ఇదేమీ పట్టనట్టు అర్జున్ కపూర్- మలైకా జోడీ తమ పంథాని విడవడం లేదు.
ఇటీవల పీసీ - దీపికల పెళ్లిలోనూ ఈ జోడీ సందడి చేసిన తీరు చూస్తే అసలు ఏం జరుగుతోంది? అంటూ ముక్కున వేలేసుకున్నారంతా. చాలా ముందు నుంచి ఈ జోడీ పెళ్లికి ప్రిపేరవుతోందన్న సంకేతాలు అందరిలోకి వెళ్లాయి. దీపిక, పీసీ పెళ్లి రిసెప్షన్లలోనూ వీళ్ల కువకువలు హైలైట్ అయ్యాయి. ``క్షణమైనా నిను వీడని నీడను నేను!`` అన్న చందంగా కుర్రహీరో వెంపర్లాడిపోవడం లీకైన ఫోటోల్లో కనిపించడంతో ఒకటే చెవులు కొరుక్కు తింటున్నారంతా. మొత్తానికి ఈ జోడీ కూడా వచ్చే వేసవిలో పెళ్లికి రెడీ అన్న ముచ్చటా సాగుతోంది. దీపిక రిసెప్షన్ వేడుకలో ఈ జంట ఛయ్య ఛయ్య! అంటూ స్టెప్పులేసిన వీడియో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు అంబానీల పెళ్లికి వెళ్లారా లేదా? అన్నది తెలియాల్సి ఉందింకా.