Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే స‌ల్మాన్ కి చిర్రెత్త‌దా?

By:  Tupaki Desk   |   18 Jan 2019 1:30 AM GMT
ఇలా చేస్తే స‌ల్మాన్ కి చిర్రెత్త‌దా?
X
లేటు వ‌య‌సు ముద్దుగుమ్మ మ‌లైకాతో యంగ్ బోయ్ అర్జున్ క‌పూర్ ప్రేమాయ‌ణం ప్ర‌స్తుతం వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట తొంద‌ర్లోనే పెళ్లికి రెడీ అవుతోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనికి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ.. ఎస్ అని కానీ, నో అని కానీ చెప్ప‌లేదు. అస‌లు ఆ ప్ర‌చారాన్ని ఖండించ‌నూ లేదు. సంతోషంగా ఉన్నాను.. మా గురించి మీకు తెలుసు క‌దా! అంటూ గుంభ‌న‌గా మాట్లాడుతోంది మ‌లైకా. మ‌రోవైపు కుర్ర‌హీరో అర్జున్ క‌పూర్ మ‌లైకాతో ప‌బ్లిక్ అప్పియ‌రెన్సుల విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

ఈ ఎఫైర్ స్పీడందుకుని ఇప్ప‌టికే ఏడాది పూర్త‌యింది. మ‌లైకా అరోరాఖాన్ బ‌ర్త్ డే వేడుక‌ల కోసం ప్ర‌త్యేకించి ఇటలీ వెళ్లిన అర్జున్ ఆ త‌ర్వాత త‌న‌తో క‌లిసి జంట‌గా చెయ్యి చెయ్యి క‌లిపి మిల‌న్ విమానాశ్ర‌యంలో మీడియా కంటికి చిక్కాడు. అక్క‌డ దొరికింది మొద‌లు మ‌లైకాతో త‌న ఎఫైర్ విష‌య‌మై దాచేదేమీ లేద‌న్నట్టుగా ఓపెన్ అయిపోతూనే ఉన్నాడు. నిండా మునిగాక చ‌లెందుకు? అన్న చందంగా అర్జున్ వాల‌కం ప‌సిగ‌ట్టిన మీడియా అత‌డి ఎఫైర్ గురించి రెగ్యుల‌ర్ ఎపిసోడ్స్ త‌ర‌హాలో ప్ర‌చారం చేస్తోంది.

తాజాగా అర్జున్ క‌పూర్, మ‌లైకా సామాజిక మాధ్య‌మాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. గ‌త ఏడాది ఈ జోడీ మిల‌న్ హాలీడే ట్రిప్ లో చిలౌట్ చేసినప్ప‌టి నుంచి.. ఓ ఫోటోని షేర్ చేసి మ‌లైకా క‌వ్వింపు చ‌ర్య‌కు దిగింది. ``టేక్ మి బ్యాక్ .. హ్యాపీనెస్.. త్రోబ్యాక్ థ‌ర్స్ డే`` అంటూ ట్వీట్ చేసింది. అందుకు ప్ర‌తిగా అర్జున్ క‌పూర్ వేరొక ఫోటోని పోస్ట్ చేసి... `హుమ్....మ్‌మ్‌.. హాలీడేస్ నుంచి ఫోటోల్ని పోస్ట్ చేసేందుకు ఇన్‌ స్టాగ్ర‌మ్ రెడీగా ఉంది`` అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఈ ఏడాది కూడా మ‌లైకా బ‌ర్త్ డే వేడుక‌ల్ని విదేశాల్లో జ‌రుపుకుంటే అక్క‌డికి అర్జున్ స్పెష‌ల్ గెస్ట్ గా ఎంట్రీ ఇస్తాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదివ‌ర‌కూ కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో మ‌లైకా త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌ని, తాను ఎన్న‌డూ లేనంత ఆనందంగా ఉన్నాన‌ని తెలిపింది. అర్జున్ క‌పూర్ మాట్లాడుతూ... రిలేష‌న్ షిప్‌లో ఉన్నాను.. త్వ‌ర‌లో పెళ్లాడ‌తాను..! అని అన్నాడు. అయితే ఫ‌లానా అమ్మాయిని పెళ్లాడుతున్నా అని మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతానికి ఈ జంట క‌వ్వింపు గురించి యూత్ ఎంతో ఇదిగా చెప్పుకుంటున్నారు. మ‌లైకాతో అర్జున్ ఎఫైర్ విష‌య‌మై ఆర్భాజ్ ఖాన్ సోద‌రుడు స‌ల్మాన్ ఎంతో సీరియ‌స్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయినా అర్జున్ త‌న కెరీర్ గురించి కానీ, ఇంకే విష‌యం లో కానీ టెన్ష‌న్ లో ఉన్న‌ట్టే క‌నిపించ‌డం లేదు.