Begin typing your search above and press return to search.

మరో స్టెప్‌ వేసిన సీక్రెట్‌ కపుల్‌

By:  Tupaki Desk   |   25 Nov 2018 1:30 PM GMT
మరో స్టెప్‌ వేసిన సీక్రెట్‌ కపుల్‌
X
బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా మరియు హీరో అర్జున్‌ కపూర్‌ లు ప్రేమలో ఉన్న విషయం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. చాలా కాలంగా వీరిద్దరి వ్యవహారం కొనసాగుతున్నప్పటికి ఇప్పటి వరకు వారిద్దరు మాత్రం బయటకు అధికారికంగా చెప్పడం లేదు. గత ఏడాది మలైకా అరోరా తన భర్త నుండి అధికారికంగా విడాకులు తీసుకున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా తమ అఫైర్‌ ను రివీల్‌ చేస్తూ వస్తున్నారు. అప్పట్లో తమపై వచ్చే వార్తలను కొట్టి పారేస్తూ వచ్చిన వీరిద్దరు, ఇప్పుడు మీడియాకు కావాలని లీక్‌ లు ఇస్తూ వాటిని కొట్టి పారేయకుండా, వాటి గురించి అడిగిన సమయంలో ఒక చిరునవ్వు విసురుతున్నారు.

వీరిద్దరు కలిసి తిరగడం, పార్టీలకు, పబ్‌ లకు హాజరు కావడం వంటివి చూస్తుంటే ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఒక జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం వీరిద్దరు ముంబయిలోని ఒక ఖరీదైన ఏరియాలో అపార్ట్‌ మెంట్‌ లో ప్లాట్‌ తీసుకున్నారట. ఇద్దరు కలిసి ఆ ప్లాట్‌ ను తీసుకున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పెళ్లి తర్వాత వీరిద్దరు ఆ ఇంట్లోనే ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది.

సహజంగా పెళ్లి తర్వాత లేదంటే ఎంగేజ్‌ మెంట్‌ తర్వాత ఇలాంటి ప్లాన్స్‌ చేసుకుంటారు. కాని అర్జున్‌ కపూర్‌ మరియు మలైకా అరోరాలు మాత్రం ముందే ప్లాన్‌ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోక ముందే అక్కడ సహజీవనం సాగిస్తారేమో అంటూ కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా కరణ్‌ షో లో పాల్గొన్న మలైకా అరోరా పెళ్లి చేసుకోబోతుందని స్వయంగా కరణ్‌ ప్రకటించాడు. అందుకే హడావుడిగా తీసుకున్న అపార్ట్‌ మెంట్‌ కు ఇంటీరియర్‌ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా ఇప్పటి వరకు మలైకా, అర్జున్‌ లు నిర్థారించలేదు. అన్ని విషయాలపై వీరిద్దరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.