Begin typing your search above and press return to search.

రిలేషన్ లో ఉన్నాం.. పెళ్లి ఆలోచన లేదు!

By:  Tupaki Desk   |   5 July 2019 2:01 PM GMT
రిలేషన్ లో ఉన్నాం.. పెళ్లి ఆలోచన లేదు!
X
తాము రిలేషన్ షిప్ లో ఉన్న మాట వాస్తవమే అని ప్రకటించాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. నటి మలైకా ఆరోరాతో అర్జున్ కపూర్ ప్రేమకథను కొత్తగా వివరించనక్కర్లేదు. ఈ నేపథ్యంలో అర్జున్ కపూర్ స్పందించాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ఓపెన్ గానే తిరుగుతున్నారు.

మలైకా ఆరోరా విడాకుల అంశం సెటిల్ అయ్యే వరకూ వీరిద్దరూ కలిసి మీడియాకు కనిపించే వారు కాదు. అయితే మీడియా మాత్రం వీరిద్దరూ జంటగా ఉన్నప్పుడు పట్టుకునేది. చివరకు భర్త అర్బాజ్ కు మలైకా విడాకులనిచ్చే ప్రక్రియ పూర్తి కావడంతో వీరిద్దరూ కలిసి విహరించడం మొదలుపెట్టారు.

విదేశాల్లో - స్వదేశంలో కలిసి తిరుగుతూ ఉందీ జంట. తాజాగా ఈ అంశంపై అర్జున్ కపూర్ స్పందించాడు. తామిద్దరం బంధంలో ఉన్న మాట వాస్తవమే అని అర్జున్ అన్నాడు. అయితే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్జున్ అంటున్నాడు.

ఇలాగే బాగుందన్నట్టుగా ఇతడు చెబుతూ ఉన్నాడు. వివాహం ఇప్పట్లో చేసుకునేది లేదు - భవిష్యత్తులో చేసుకుంటా.. అని కూడా తను చెప్పడం లేదన్నట్టుగా అర్జున్ మాట్లాడుతుండటం గమనార్హం. పెళ్లి గురించి ఆలోచనే లేదని మాత్రం తేల్చేస్తున్నాడు!