Begin typing your search above and press return to search.

మ‌లైకాతో డేట్.. శ్రీ‌దేవిపై హేట్..ఫ్యాన్ పంచ్‌!!

By:  Tupaki Desk   |   29 May 2019 10:59 AM GMT
మ‌లైకాతో డేట్.. శ్రీ‌దేవిపై హేట్..ఫ్యాన్ పంచ్‌!!
X
సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కం పైత్యాన్ని జ‌నంపై రుద్దుతున్న వైనం చూస్తున్న‌దే. కొంద‌రు నోటికొచ్చిన‌ది కూసి ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోతున్నారు. వివేక్ ఒబేరాయ్- స‌ల్మాన్ ఖాన్ అంత‌టి వాళ్ల‌కే చీవాట్లు త‌ప్ప‌లేదు. మొన్న‌టికి మొన్న ఐశ్వ‌ర్యారాయ్ గురించి కారుకూత‌లు కూసి వివేక్ ఒబేరాయ్ మ‌హిళా మండ‌లికి దొరికిపోయాడు. అటుపై స‌ల్మాన్ సైతం ప్రియాంక చోప్రాపై ఊహించని కామెంట్ చేసి బుక్క‌యిపోయాడు.

అయితే రెగ్యుల‌ర్ గా త‌మ అభిమాన హీరోల్ని ట్విట్ట‌ర్- ఇన్ స్టాలో ఫాలో చేసే అభిమానులు సైతం మాట జారి సెల‌బ్రిటీల్ని హ‌ర్ట్ చేస్తున్నారు. వారి సెంటిమెంట్ల‌ను గౌర‌వించ‌కుండా సూటి పోటి మాట‌ల‌తో సామాజిక మాధ్య‌మాల్లో ఫ్యాన్స్ చెల‌రేగిపోవ‌డం ప‌లు మార్లు బ‌య‌ట‌ప‌డింది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్ ని ఉద్ధేశించి నెటిజ‌న్ కుసుమ్ భుటానీ అనే లేడీ అభిమాని చేసిన కామెంట్ జోరుగా వైర‌ల్ అయిపోయింది. ``మీ అమ్మను మీ నాన్న‌గారు వ‌దిలేశార‌ని.. మీ నాన్న‌గారి రెండో భార్య శ్రీ‌దేవిని ఎంతో ద్వేషించారు. కానీ మీరు మాత్రం మీకంటే 11ఏళ్ల పెద్ద వ‌య‌సు ఉన్న.. పిల్ల‌ల త‌ల్లి మ‌లైకాతో డేటింగ్ చేస్తున్నారు. ఎందుకీ డ‌బుల్ స్టాండార్డ్?`` అంటూ ఘాటైన వ్యాఖ్య‌ను అభిమాని పోస్ట్ చేయ‌డంతో చిర్రెత్తిన అర్జున్ క‌పూర్ త‌న‌కు అంతే ఇదిగా రిప్ల‌య్ ఇచ్చారు.

``నేను ఎవ‌రినీ ద్వేషించ‌లేదు కుసుమ్. మేం ఎంతో హుందాగా దూరంగా పెట్టాం అంతే. ఆ సెన్సిటివ్ టైమ్ (శ్రీ‌దేవి మ‌ర‌ణించిన‌ప్పుడు) లో నేను నాన్న‌(బోనీ క‌పూర్)గారికి చెల్లెళ్లు జాన్వీ- ఖుషీల‌కు చేరువ‌గా లేక‌పోయి ఉంటే ఏమ‌య్యేదో?! మీరు కొంచెం ఆలోచించండి. మీరు వ‌రుణ్ ధావ‌న్ ఫ్యాన్. ద‌య‌చేసి మీ హీరో ఫేస్ ని డీపీగా పెట్టి ఇలా నెగెటివిటీని ప్ర‌చారం చేయ‌కండి`` అంటూ చుర‌క‌లు వేశాడు.

ఆ దెబ్బ‌కు దిగొచ్చిన అభిమాని .. ``సారీ స‌ర్ నేను ఎవ‌రినీ హ‌ర్ట్ చేయాల‌ని అనుకోవ‌డం లేదు. జ‌రిగిన దానికి క్ష‌మించండి!`` అంటూ ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. మీకు నేను వ్య‌తిరేకిని కాను.. కేవ‌లం అభిప్రాయం మాత్ర‌మే చెప్పాన‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది స‌ద‌రు వీర ఫ్యాన్స్. మొత్తానికి త‌ప్పుడు కూత కూసి నాలుక క‌రుచుకోవ‌డం బ‌య‌ట‌ప‌డింది. అయితే అర్జున్ క‌పూర్ పై స‌ద‌రు అభిమాని అభిప్రాయాన్ని చాలా సంద‌ర్భాల్లో బాలీవుడ్ మీడియానే లైవ్ లో ప్ర‌చారం చేసింది. అత‌డు స‌వ‌తి త‌ల్లి శ్రీ‌దేవిని.. చెల్లెళ్లు జాన్వీ-ఖుషీని ద్వేషించాడా లేదా? దూరం పెట్టాడా లేదా? అంటూ డిబేట్లు న‌డిపాయి. అంటే అర్జున్ క‌పూర్ పై నెగెటివిటీని ప్ర‌చారం చేసిన‌ది మీడియానే అని చెప్పాలి. అప్పుడు మీడియా ప్ర‌చారాన్ని ఖండించ‌లేక‌ ఇప్పుడిలా అత‌డు అభిమానిపై వీరంగం వేశాడ‌ని భావించాలేమో!!