Begin typing your search above and press return to search.

చెల్లెలున్నా నాన్న ఉన్నా డోంట్ కేర్

By:  Tupaki Desk   |   20 Nov 2018 7:08 AM GMT
చెల్లెలున్నా నాన్న ఉన్నా డోంట్ కేర్
X
అదేమీ పైత్యమో కానీ బహుశా రేటింగ్స్ కోసం పడుతున్న తాపత్రయం కాబోలు దర్శక నిర్మాత కం యాంకర్ కరణ్ జోహార్ తన ఇంటర్వ్యూ షోలో విపరీతాలకు పోతున్నాడు. సెక్స్ డేటింగ్ గురించి ప్రశ్నలు అతని కాఫీ విత్ కరణ్ షోలో సహజమే అయినప్పటికీ భార్యభర్తలు లేదా అక్కచెల్లెలు వచ్చినప్పుడు అదేమంత ఇబ్బంది అనిపించేది కాదు. కానీ ఈ మధ్య పార్టిసిపెంట్స్ మధ్య వరసలు కూడా మర్చిపోతున్నాడు కరణ్. ఇటీవలే కూతురు సారా ముందే సైఫ్ అలీ ఖాన్ తో కరీనా సెక్స్ లైఫ్ గురించి అడిగి సోషల్ మీడియాలో చీవాట్లు తిన్న సంగతి మర్చిపోకముందే తాజాగా అలాంటిదే మరో సందర్భాన్ని సృష్టించాడు.

అర్జున్ కపూర్ జాన్వీ కపూర్ పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో సెక్స్ గురించి అర్జున్ కపూర్ కు ప్రశ్నలు వేయడంతో రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు పక్కన ఉండగా ఇలా అడుగుతావా అంటూ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో ప్రోమోతోనే సదరు ఛానల్ బాగా హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ టాక్ ప్రకారం ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందని సమాచారం. షో మొదలు కరణ్ తాను ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నాడో ముందే క్లూస్ ఇస్తాడని వాటికి వాళ్ళు ఒప్పుకుంటే దానికి తగ్గట్టే డోస్ పెంచుతాడట. ఒకవేళ అభ్యంతరం అనిపిస్తే అది కూడా షోలోనే చెప్పాలని పబ్లిసిటీ హెల్ప్ అవుతుందని సెట్ చేస్తాడట.

ఇది నిజమో కాదో కాని షో జరుగుతున్న వరస చూస్తే అనుమానం రాక మానదు.అర్జున్ కపూర్ తన చెల్లెలు జాన్వీతో కలిసి ఇలా టీవీ షోలో పబ్లిక్ గా పాల్గొనడం ఇదే మొదటిసారి. శ్రీదేవి స్వర్గస్తురాలయ్యాక గతంలో లేని విధంగా ఇద్దరు చెల్లెళ్ళు జాన్వీ ఖుషిని అక్కున చేర్చుకున్న అర్జున్ కపూర్ గట్టి అండగా నిలబడుతున్నాడు. అన్నట్టు కరణ్ జోహార్ అర్జున్ ను ఒక్కటే కాదు జాన్వీని సైతం డేటింగ్ కబుర్ల గురించి అడిగాడు. ఏదో ఒక సెన్సేషన్ లేనిదే జనం చూడరని తెలిసినా మరీ ఇలాంటి ప్రశ్నలు ఏమిటో కరణ్ ఆలోచించుకుంటే బెటర్