Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ గాళ్‌ ఫ్రెండ్ తో హీరో పడుకున్నాడట

By:  Tupaki Desk   |   21 Nov 2016 9:30 AM GMT
ఫ్రెండ్ గాళ్‌ ఫ్రెండ్ తో హీరో పడుకున్నాడట
X
బాలీవుడ్ లో హీరో- హీరోయిన్స్ లవ్ లో పడటం.. బ్రేకప్ చెప్పేసుకోవడం చాలా కామన్. ఇక ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ముందుంటాడు యూత్ హార్ట్ త్రోబ్ రణబీర్ కపూర్. యాక్టర్ గా రణబీర్ సూపర్.. ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ తిరుగులేదు. కానీ లవర్స్ విషయంలో మాత్రం ఈ కపూర్ బాయ్ ది వరస్ట్ ట్రాక్ రికార్డ్. కో- స్టార్స్ తో సంవత్సరాల తరబడి డేటింగ్ చేయడం.. పెళ్లి ఖాయం అనుకునే టైంకి వాళ్లకి బైబై చెప్పేయడం రణబీర్ కి చాలా నార్మలైపోయింది. అయితే ఇప్పుడు అంతకన్నా షాకింగ్ మేటర్ ఇంకొటి చెప్పాడు రణబీర్.

రీసెంట్ గా రణవీర్ సింగ్.. అర్జున కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నాడు రణబీర్ కపూర్. ముగ్గురు కుర్ర హీరోలు చేతికి దొరికే సరికి డైరెక్టర్ కరణ్ కూడా నాటీ క్వశ్చన్స్ వేశాడు. మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడైనా పడుకున్నారా అంటూ డైరెక్ట్ గా అడిగేశాడు. అవును అని నోటితో చెప్పకుండా పక్కనే ఉన్న అర్జున్ కపూర్ కి ముద్దు పెట్టి కన్ఫామ్ చేయమన్నాడు. ఆ పడుకోవడం అనే ప్రశ్నలో మీనింగ్ ఏంటో కానీ సెకన్ కూడా ఆలోచించకుండా రణబీర్ అర్జున్ కి ముద్దు పెట్టేసి తమ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో పడుకున్నామని చెప్పేశాడు. ఇంకో హీరో రణవీర్ సింగ్ కూడా డిటో చేశాడు.

అయితే తాను డేటింగ్ చేసిన హీరోయిన్స్ ని మాత్రం ఓన్లీ లవ్ చేశానే తప్ప వాళ్లతో అంతకుమించి దూరం వెళ్లలేదని చెప్పాడు. అసలు కాఫీ విత్ కరణ్ ప్రొగ్రామే అలాగే ఉంటుంది. వినడానికి పచ్చిగా ఉన్నాయని అనిపించినా గెస్ట్స్ గా వచ్చిన వాళ్లు మాత్రం దేన్నైనా ఓపెన్ గానే మాట్లాడతారు. కరణ్ ప్రశ్నలే ఘోరమనుకుంటే.. దానికి గెస్ట్ లిచ్చే సమాధానాలు అంతకుమించి. ఇక ఇంకెవరో గర్ల్ ఫ్రెండ్ దగ్గర అంత చనువు తీసుకొన్న రణబీర్ తన గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో మాత్రం సిన్సియర్ గా ఉన్నాడంటేనే చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/