Begin typing your search above and press return to search.

ఆంటీకి ఆ యువ హీరో నైట్ కాల్స్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   26 Feb 2016 7:30 PM GMT
ఆంటీకి ఆ యువ హీరో నైట్ కాల్స్ చేస్తున్నాడా?
X
కొన్ని కాంబినేషన్లు ఆసక్తికరంగా ఉండటాయి. అందరి దృష్టి పడేలా ఉంటాయి. ఒక యువ నటుడు.. ఒక సీనియర్ నటి.. ఒక సీనియర్ నటుడు.. ఒక కుర్రహీరోయిన్ అన్న వెంటనే ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తే తాజాగా కీ అండ్ కా పెయిర్ కరీనా కపూర్.. అర్జున్ కపూర్ పట్ల వ్యక్తమవుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో భార్యభర్తలుగా నటిస్తున్న ఈ జంట.. కథలో భాగంగా కిస్సింగ్ సీన్లలో అదరగొట్టేయటం.. పెళ్లి తర్వాత ఎలాంటి మొహమాటాలకు పోకుండా కథ చేసిన డిమాండ్ కు తగ్గట్లే చెలరేగిపోవటం.. సినిమాకు అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రచారం లభించింది.

ఇదిలా ఉంటే.. తెర మీద ప్రదర్శించిన క్లోజ్ నెస్.. తెర వెనుక కూడా మొయింటైన్ చేస్తున్నాడన్నది తాజా టాక్ గా మారింది. కరీనా ఆంటీకి అర్జున్ లేట్ నైట్ కాల్స్ చేస్తన్నాడని.. ఒక్కో కాల్ సుదీర్ఘంగా సాగిపోతుందన్నది బాలీవుడ్ తాజా కబర్ గా మారింది. ఈ కాల్స్ కరీనా భర్త సైఫ్ కు చిరాగ్గా మారినట్లు చెబుతున్నారు. అలవాటులో భాగంగా ఇటీవల ఒక లేట్ నైట్ కరీనాకు అర్జున్ కాల్ చేశారట. ఈ కాల్ ను సైఫ్ రిసీవ్ చేసుకున్నారని.. ఈ సందర్భంగా అర్జున్ కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. సీనియర్ నటుల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పే ప్రయత్నం చేసిన సైఫ్ దెబ్బకు.. అర్జున్ అడ్డంగా బుక్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. ఆంటీకి లేట్ నైట్ కాల్స్ లెక్కేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.