Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లు ఈ డేటింగులు.. పెళ్లి చేస్కోరా?

By:  Tupaki Desk   |   2 March 2020 7:30 AM GMT
ఎన్నాళ్లు ఈ డేటింగులు.. పెళ్లి చేస్కోరా?
X
మలైకా అరోరా - అర్జున్ కపూర్ చెలిమి ప్రేమాయ‌ణం అన్నివేళ‌లా హాట్ టాపిక్. బాలీవుడ్ హాట్ క‌పుల్ అంటూ మీడియా అనునిత్యం వెంట‌ప‌డుతూనే ఉంది. ఇక ఈ జోడీ త్వ‌ర‌లోనే పెళ్లాడేయ‌బోతున్నారు అంటూ నానా రాద్ధాంతం తెలిసిందే. అయితే వేర్వేరు సంద‌ర్భాల్లో పెళ్లికి మేం ఇప్పుడే సిద్ధంగా లేమ‌ని ఆ ఇద్ద‌రూ వెల్ల‌డించారు. ఆర్బాజ్ తో విడాకుల త‌ర్వాత‌ కొత్త జీవితం చాలా సంతోషంగా ఉంద‌ని కూడా మ‌లైకా అన‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ఇక ప్ర‌తిసారీ మ‌లైకా విష‌యంలో అర్జున్ క‌పూర్ ఓవ‌ర్ ప్రొటెక్ష‌న్ యాక్టివిటీ అంత‌ర్జాలం లో హాట్ టాపిక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. 2018 లో తమ మ‌ధ్య బాంధ‌వ్యాన్ని బ‌హిరంగంగా అంగీక‌రించిన త‌ర్వాత అర్జున్ అస‌లే వ‌దిలిపెట్ట‌డం లేదు. మ‌లైకా లేనిదే జీవితం లేదు! అన్నంత‌గా త‌న‌తో ప్రేమ‌లో మునిగిపోయాడు. ఏ ఈవెంట్ కి వెళ్లినా.. ప్రెస్ మీట్ కి వెళ్లినా త‌న వెంటే ఉండి అర్జున్ బాడీ గార్డ్ లా కాప‌లా కాస్తుంటాడు. అత‌డు ఓవ‌ర్ ప్రొటెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్ప‌టికే బ‌య‌ట‌ ప‌డింది.

ఈ బాండింగ్ వ‌ల్ల స‌ల్మాన్ ఫ్యామిలీ తో త‌న స‌త్సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయ‌ని అర్జున్ తండ్రి బోనీక‌పూర్ ఆవేద‌న చెందినా అదేదీ అత‌డికి ప‌ట్ట‌నేలేదు. అంతేకాదు మ‌లైకా తో చెట్టా ప‌ట్టాల్ అంటూ డిన్న‌ర్ డేట్లు.. విదేశీ ట్రిప్ లు తెలిసిందే. తాజాగా ఆదివారం రాత్రి ఈ జంట డిన్న‌ర్ డేట్ కి బయలుదేరిన‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ గా మారాయి. మ‌లైకా- అర్జున్ బంధం విడదీయ రానిదిగా కనిపిస్తోంది. అయితే ఇంకా ఇలా ఎన్నాళ్లు? పెళ్లి సంగ‌తి చెప్ప‌రా? అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో ఈ జంట‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అశుతోష్ గోవారికర్ పీరియడ్ డ్రామా `పానిపట్‌`లో అర్జున్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్న ఓ చిత్రంలోనూ అత‌డు న‌టిస్తున్నాడు.