Begin typing your search above and press return to search.

ఆంటీతో పెళ్లిని వాయిదా వేస్తున్న హీరో!

By:  Tupaki Desk   |   8 May 2019 5:30 PM GMT
ఆంటీతో పెళ్లిని వాయిదా వేస్తున్న హీరో!
X
మలైకా ఆరోరా తన భర్తతో విడిపోవడానికే కారణం అర్జున్ కపూర్ అని కొంతమంది అంటారు. అర్జున్ కపూర్ తో మలైకాకు సంబంధం ఏర్పడిందని, దీంతో అప్పటి భర్తకు దూరంగా ఉంటున్న ఆమె విడాకులతో ఆ బంధాన్ని పూర్తిగా తెంచేసుకుందని బాలీవుడ్ మీడియా చెబుతూ వచ్చింది.

అర్బాజ్ ఖాన్ తో విడాకుల అనంతరం మలైకా ఆరోర పూర్తిగా ఓపెనప్ అయ్యింది. అర్జున్ కపూర్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంది. వీరిద్దరూ అంతకు ముందు తమ బంధాన్ని లో ప్రొఫైల్ లో ఉంచారు. ఆతర్వాత మత్రం పూర్తిగా ఓపెనప్ అయిపోయారు. విదేశీ విహారాలు కూడా చేశారు జంటగా!

అలా మీడియాకు కనిపించి తమ మధ్య ఉన్న బంధాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే మాట కూడా వినిపిస్తూ ఉంది. ఈ మేరకు ఊహాగానాలున్నాయి. అయితే అర్జున్ కపూర్ మాత్రం వీటిని ఖండిచండమే పనిగా పెట్టుకున్నాడు. తను మలైకాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వస్తున్న వార్తలు అబద్ధమని అతడు అంటున్నాడు.

తను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదంటూ అతడు స్పష్టం చేశాడు. త్వరలో పెళ్లి చేసుకోబోయే బాలీవుడ్ సెలబ్రిటీల జాబితాలో తాను లేనట్టుగా అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. తను సినిమాలతో బిజీ అని అంటున్నాడు. కొంచెం విరామంలో అర్జున్ కపూర్ ఇలా ప్రకటించడం ఇది రెండో సారి. మరి ఇతడి తీరు చూస్తుంటే.. ఆంటీతో పెళ్లిని వాయిదా వేస్తున్నాడా లేక పూర్తి గా రద్దే చేస్తున్నాడా.. అనే సందేహాలు నెలకొంటున్నాయి.