Begin typing your search above and press return to search.

మలైకా అందుకే ఇష్టం అంటున్న కుర్ర ప్రియుడు

By:  Tupaki Desk   |   19 April 2020 10:00 PM IST
మలైకా అందుకే ఇష్టం అంటున్న కుర్ర ప్రియుడు
X
యువ హీరో అర్జున్ కపూర్.. సీనియర్ నటీమణి మలైకా అరోరా మధ్య జరుగుతున్న ప్రేమాయణం బాలీవుడ్లో చాలా కాలంగా ఓ హాట్ టాపిక్. ఇద్దరి మధ్య దాదాపు పన్నెండేళ్ల వయసు తేడా ఉండడమే దానికి కారణం. పైగా మలైకా కు టీనేజ్ వయసున్న పిల్లలు ఉన్నారు. మొదటి భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకొని గత మూడేళ్లుగా సింగిల్ గానే ఉంటుంది. అయితే ఆ విడాకులకు కారణం అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారమే బాలీవుడ్లో అప్పట్లోనే కథనాలు వచ్చాయి.

అంతా బాగుంది కానీ అసలు అర్జున్ కపూర్ కు మలైకా లో నచ్చే విషయాలు ఏంటి? ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు ఓపెన్ గా వెల్లడించాడు. తనది భిన్నమైన వ్యక్తిత్వం అని.. అందరూ తనను భరించలేరు అని అన్నాడు. అయితే మలైకా మాత్రం తనను ఓపిగ్గా భరిస్తుందని.. చక్కగా మేనేజ్ చేస్తుందని తెలిపాడు. అంతేకాదు మలైకా లో తనకు నచ్చే విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పాడు. ఆమెను పూర్తిగా ఇష్టపడతాను అని కూడా తెలిపాడు.

అర్జున్ మొదట్లో మలైకా వ్యవహారాన్ని గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసేవాడు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నించినా సమాధానం దాటవేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఓపెన్ గానే ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి.