Begin typing your search above and press return to search.
భామా కలాపం మూణ్ణాళ్ల ముచ్చటేనా?
By: Tupaki Desk | 15 Feb 2019 10:00 AM GMTకుర్రహీరో అర్జున్ కపూర్ - ముదురు భామ మలైకా అరోరాఖాన్ ఎఫైర్ కహానీ తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా వేడెక్కించే ప్రేమాయణం ఇటీవల బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్. ఆర్భాజ్ ఖాన్ నంచి విడాకులు తీసుకున్న మలైకా సదరు కుర్రహీరోతో రొమాన్స్ సాగించడం.. ఆ ఇద్దరూ కలిసే పార్టీలు, పబ్బులు అంటూ షికార్లు చేయడం సర్వత్రా వేడెక్కించే చర్చకు కారణమైంది. ఈ తెగింపు కొందరికి కంటగింపుగా ఉందన్న ప్రచారం సాగింది. ముఖ్యంగా ఆర్భాజ్ సోదరుడు కండల హీరో సల్మాన్ ఖాన్ అర్జున్ కపూర్ పై గరంగరంగా ఉన్నారని ప్రచారమైంది. సోదరి అర్పిత తో ప్రేమాయణం సాగించిన అర్జున్ అటుపై తనతో బ్రేకప్ అయ్యి.. అప్పటికే పెళ్లయిన మలైకాతో ఎఫైర్ సాగించడం సల్మాన్ కోపానికి కారణమైంది. దీంతో తనకు ఎంతో సన్నిహితుడైన బోనీకపూర్ తో సల్మాన్ స్నేహం చెడింది. అది కూడా కొడుకు వల్లనే అన్న చర్చా సాగింది. దీంతో మలైకాతో ఎఫైర్ వద్దని బోనీ వారించే ప్రయత్నం చేశారని వార్తలొచ్చాయి.
ఇదంతా ఓ కోణం అనుకుంటే తాజాగా మలైకా - అర్జున్ మధ్య బ్రేకప్ అంటూ మరో వార్త బాలీవుడ్ ని వేడెక్కిస్తోంది. ప్రేమికుల రోజున ఈ ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సైలెంట్ గా ఉన్నారు. పైగా సింగిల్ గా ఉన్న ఫోటోల్ని మాత్రమే ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఆ ఇద్దరి మధ్యా లవ్ గోల్స్ మిస్ ఫైర్ అయ్యాయన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రేమికులు అయితే లవర్స్ డే రోజున బయటపడేవారే! అంటూ మాట్లాడుకున్నారంతా.
అయితే గత కొంతకాలంగా అర్జున్ లో రియలైజేషన్ మొదలై ఉంటుంది అన్న ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. తనకంటే వయసులో ఎంతో పెద్దది అయినా మలైకాని పెళ్లాడుతున్నాడంటూ మీడియా షంటేయడంతో అతడిలో మార్పు కనిపిస్తోందట. దాంతో మలైకను స్నేహం వరకే కంట్రోల్ చేస్తున్నాడన్న కొత్త పుకార్ వేడి పెంచుతోంది. అయితే స్నేహానికి పరిమితమయ్యాడా.. లేక బ్రేకప్ చెప్పేశాడా? అన్నది కొద్ది రోజుల్లో బయటపడుతుందేమో!! ప్రస్తుతానికి అంతా గప్ చుప్. ఇప్పటికి అర్జున్ సినిమాలతో బిజీ. ప్రస్తుతం `సందీప్ ఔర్ పింకీ పరార్`, `ఇండియాస్ మోస్ట్ వాంటెడ్`, `పానిపట్` చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. కెరీర్ పరంగా జోరు పెరిగింది కాబట్టి ఇకపై అయినా ఎఫైర్ గోల నుంచి బయటపడాలనేది బోని కోరిక. డాడ్ మాటకు విలువిచ్చే ఇలా చేస్తున్నాడా? అన్నది చూడాలి.