Begin typing your search above and press return to search.
థియేటర్లలో కూర్చుంటున్న ముసుగుమనిషి!
By: Tupaki Desk | 11 May 2019 11:38 AM GMTఅసలు లాభాలు వస్తాయో తెలియకపోయినా సినిమాను ఎంతో రిస్క్ తీసుకొని తెరకెక్కిస్తారు. అలా రెడీ అయిన సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరకడం.. ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేయడం ఎంతో ముఖ్యం. లేకపోతే సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా ప్రేక్షకులకు చేరే అవకాశం ఉండదు. అందుకే ఫిలిం మేకర్లు ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతూ ఉంటారు.
బాలీవుడ్ లో 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో అర్జున్ కపూర్. రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మే 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్లు బాగున్నాయి కానీ ఎందుకో సినిమా పై పెద్దగా క్రేజ్ లేదు. దీంతో నిర్మాతలు విభిన్నతరహా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాలో హీరో తన టీమ్ తో కలిసి ఒసామా అనే ఒక భయంకర తీవ్రవాదిని పట్టుకునే మిషన్ లో ఉంటాడు. ఆ ఒసామా ఇండియలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. పట్టుకునే లోపే పాదరసంలా జారిపోతాడట. అందుకే ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని థియేటర్లలో 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' పోస్టర్ లు ఉండే చోట ముసుగు మనిషి బొమ్మలను పెట్టారు. ఒక కుర్చిపైన చక్కగా కూర్చొని ఉంటాడు ఈ ముసుగుమనిషి.
సినిమా కాన్సెప్ట్ టెర్రరిస్ట్ హంట్ కానీ ఈ బొమ్మ మాత్రం ఏదో హారర్ సినిమాకు పెట్టాల్సిన బొమ్మలా ఉంది. అంటే ఆ తీవ్రవాది దెయ్యంలా భయంకరమైన వాడని.. మన చేతికి అందడని ఇలా డిజైన్ చేసినట్టున్నారు. ఏదైతేనేం.. థియేటర్ కు వచ్చినవారు ఆ బొమ్మను చూస్తారు కాబట్టి సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కినట్టే. మరోవైపు ఈ వెరైటీ పబ్లిసిటీ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రమోషన్ ట్రిక్కులు ఫలించి సినిమాపై బజ్ పెరిగితే ఫిలిం మేకర్స్ కు మంచిదే కదా.