Begin typing your search above and press return to search.
సవితి చెల్లెల్లతో గొప్ప అనుబంధం లేదన్న హీరో
By: Tupaki Desk | 5 Jan 2022 12:30 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ రూటు సపరేటు అన్నట్లుగా ఉంటాడు. ఆయన ఇండస్ట్రీలోనే అతి పెద్దదైన కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో అయినా కూడా స్వశక్తితో పెరిగేందుకు ప్రయత్నించాడు. అంతే కాకుండా హీరోగానే కాకుండా మంచి పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఇక అర్జున్ కపూర్ పర్శనల్ విషయాలకు వస్తే ఆయన తన కంటే 12 ఏళ్ల వయసు పెద్ద అయిన మలైక అరోరాతో ప్రేమలో ఉన్నాడు. ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. తన మనసుకు నచ్చిన వారితో జీవితాన్ని పంచుకుంటున్నా ఇందులో తప్పేముంది అన్నట్లుగా ఆయన సమాధానం చెబుతున్నాడు. వయసు చూసి ప్రేమించడం.. వారితో జీవితం పంచుకోవడం అనేది అవివేకంగా తాను భావిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక టాక్ షో లో తన రిలేషన్ షిప్ గురించి ఇంకా పలు విషయాల గురించి మాట్లాడాడు.
తన తండ్రి రెండవ భార్య అయిన శ్రీదేవి ఇద్దరు కూతుర్లు అయిన జాన్వీ కపూర్ మరియు ఖుషి కపూర్ లతో తనకు ఉన్న అనుంబంధం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. వారిద్దరు కూడా అర్జున్ కపూర్ కు సవతి చెల్లెల్లు అవుతారు. తల్లి లేని ఆ ఇద్దరి బాధ్యత తండ్రి తర్వాత అర్జున్ కపూర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన నుండి అన్నగా సహాయం ను సహకారాన్ని వారిద్దరు తీసుకుంటారనే టాక్ బాలీవుడ్ వర్గాల వారు అంటూ ఉంటారు. జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ భయ్యా తో తాము క్లోజ్ గా ఉంటామని చెప్పుకొచ్చింది. తమకు పలు సందర్బాల్లో అండగా నిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది. కాని అర్జున్ కపూర్ మాత్రం చాలా విభిన్నంగా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
తన స్టెప్ సిస్టర్స్ తో గొప్ప అనుబంధం సంబంధం లేదు అన్నట్లుగా చెప్పేశాడు. అలా అని వారితో మాట్లాడకుంటా ఉంటాను అని కాదు అన్నాడు. వారిద్దరు కూడా నాతో మాట్లాడుతారు.. అలా అని రెగ్యులర్ గా వారు నాతో కలవరు. వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా వద్దకు సాయం కోసం వస్తారు.. వారికి ఏ అవసరం అయినా కూడా నన్ను అడుగుతారు. అప్పుడు నాకు సాధ్యం అయినంత వరకు మద్దతుగా నిలుస్తాను. వారి కోసం నేను ఆ సమయంలో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. మాది ఓ అందమైన కుటుంబం.. మేము అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్పలేను అన్నట్లుగా నిర్మొహమాటంగా చెప్పేశాడు. తండ్రి కూతుళ్లు అవ్వడం వల్ల వారి పట్ల బాధ్యత గా ఉంటానని మాత్రం అర్జున్ చెప్పడం విశేషం. ఇలా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది గొప్ప విషయం అన్నట్లుగా నెటిజన్స్ అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు.