Begin typing your search above and press return to search.
హిందీలోకి వెళుతున్న ధృవ
By: Tupaki Desk | 6 July 2017 4:22 AM GMTరామ్ చరణ్ కు మంచి సక్సెస్ ను అందించిన మూవీ ధృవ. తన రేంజ్ హిట్ అందుకోవడంలో కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న మెగా పవర్ స్టార్.. అన్ సీజన్ లో వచ్చి కూడా అదిరిపోయే సక్సెస్ సాధించాడు. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
జయం రవి హీరోగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించగా.. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ తని ఒరువన్ కు.. ధృవ అఫీషియల్ రీమేక్. రెండు భాషల్లో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. బాలీవుడ్ టాక్ ప్రకారం మున్నా మైకేల్ దర్శకుడు సబ్బీర్ ఖాన్ హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగులో రామ్ చరణ్ పోషించిన రోల్ లో.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా నటిస్తాడని తెలుస్తోంది. అయితే.. విలన్ పాత్ర విషయంలో మాత్రం హిందీ ఫిలిం మేకర్స్ కీలకమైన మార్పు చేస్తున్నారు.
తెలుగు.. తమిళ్ రెండు భాషల్లోనూ సిద్ధార్ధ్ అభిమన్యు పాత్రలో అరవింద్ స్వామి కనిపించి మెప్పించాడు.. అలరించాడు. కానీ హిందీ వెర్షన్ కు వచ్చేసరికి ఈ రోల్ ను మరో యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చేయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అరవింద్ స్వామి ఈ పాత్రకు ప్రాణం పోసినా.. బాలీవుడ్ వెర్షన్ కు వచ్చేసరికి.. ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడుతుండడంతో.. ఆసక్తి బాగానే నెలకొంది.