Begin typing your search above and press return to search.
‘ధృవ’ హిందీ రీమేక్.. తేడా కొడుతోందే!
By: Tupaki Desk | 7 July 2017 9:00 AM GMTరెండేళ్ల కిందట తమిళంలో ‘తనీ ఒరువన్’ సినిమా విడుదలై వారం తిరక్కుండానే ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. ముందుగా తెలుగు నిర్మాతలు రైట్స్ పట్టేశారు. చకచకా రీమేక్ పనులు మొదలుపెట్టేశారు. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి ‘ధృవ’ పేరుతో ‘తనీ ఒరువన్’ను రీమేక్ చేశాడు. తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. తమిళంలో మాదిరే ఇక్కడా అరవింద్ స్వామి క్యారెక్టర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన తప్ప మరెవరూ ఆ పాత్రకు సరిపోరు అన్న భావన తెలుగు ప్రేక్షకులకూ కలిగింది. తన కోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందనిపించేలా అందులో ఒదిగిపోయాడు అరవింద్.
ఐతే ఇప్పుడు ‘తనీ ఒరువన్’ హిందీ రీమేక్ తెరమీదికి వచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించబోతున్నాడట. అక్కడి వరకు ఎవరికీ అభ్యంతరాలు కనిపించట్లేదు. జయం రవి.. రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ని ఎవరైనా చేయొచ్చు. కానీ అరవింద్ స్వామి పాత్ర కోసం తీసుకున్న నటుడి విషయంలోనే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఈ క్యారెక్టర్ని హిందీలో అర్జున్ కపూర్ చేస్తాడట. అరవింద్ స్వామి పాత్రకు హిందీలో కూడా ఆయన్నే అడిగినట్లు వార్తలొచ్చాయి. ఐతే తెలుగులో ఆ పాత్రకు అరవింద్ ను ఒప్పించడానికే చాలా కష్టమైందట. అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నించిన అరవింద్ స్వామిని ఒప్పించినట్లు తెలిసింది. హిందీ కోసం మాత్రం అతను నో అనేసినట్లు సమాచారం.
అలాంటపుడు అరవింద్ పాత్రను రీప్లేస్ చేయగలిగే సీనియర్ నటుడు ఎవరినైనా ట్రై చేయాల్సిందేమో. కానీ కుర్రాడైన అర్జున్ కపూర్ ఆ పాత్రకు ఏమాత్రం సరిపోతాడన్నది సందేహం. ‘వర్షం’ రీమేక్ ‘భాగి’ని డైరెక్ట్ చేసిన సాబిర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.