Begin typing your search above and press return to search.
చెల్లిని ట్రాల్ చేసినందుకు హీరో సీరియస్
By: Tupaki Desk | 5 Jun 2018 4:53 PM GMTసాధారణంగా కొన్ని మీడియా రాసే వార్తలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒకప్పుడు నేతలపై ఘాటుగా రాస్తే.. ఇప్పుడు గ్లామరస్ బ్యూటీల మీద ఘాటుగా రాసేస్తున్నారు. ఆడిగేవాళ్ళు లేక డోస్ బాగానే పెంచేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ వెబ్ సైట్లను తిరగేస్తే మనకే అర్ధమవుతుంది. రీసెంట్ గా ఒక మీడియా వాళ్లు అధికారిక ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ వైరల్ అయ్యింది.
వెంటనే హీరో అర్జున్ కపూర్ వాళ్లకి కౌంటర్ ఇచ్చేశాడు. ఈ స్థాయిలో ఓ ప్రముఖ మీడియా ఏ విధంగా ట్రాల్స్ వేస్తుందో అని ఇదొక హాస్యాస్పదం అని క్లాప్స్ కొట్టాలని చాలా నెమ్మదిగా కొట్టండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇదంతా అర్జున్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే.. శ్రీదేవి కూతురుని వాళ్లు అసభ్యంగా ట్రాల్స్ చేయడమే అసలు కారణం. జాన్వీ కపూర్ ఒక లో స్కర్ట్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. జాన్వీ ఎదో వేసుకోవడం మర్చిపోయింది అని ఫ్యాన్స్ అంటున్నారు అని ట్వీట్ చేశారు. దానితో అన్నయ్య అర్జున్ కు చిర్రెత్తుకొచ్చింది.
జాన్వీ తల్లి శ్రీదేవి.. అర్జున్ కపూర్ తండ్రి బోణి కపూర్ రెండవ భార్య అని అందరికి తెలిసిందే. అయితే శ్రీదేవి మరణించినప్పటి నుంచి అర్జున్ తన సిస్టర్స్ ను ప్రేమగా చూసుకుంటున్నాడు. వారికి రక్షణగా ఉంటున్నాడు. అందులో భాగంగానే ఓ ప్రముఖ మీడియా ట్రాల్ వేయడం ఈ బాలీవుడ్ అన్నయ్య తట్టుకోలేక పోయాడు. వెంటనే కౌంటర్ ఇచ్చి తన చెల్లికి అండగా ఉన్నట్లు చెప్పకనే చెప్పేశాడు.