Begin typing your search above and press return to search.
డేటింగ్ తో ఫండ్సా.. నువ్వు దేవుడివి సామీ!
By: Tupaki Desk | 8 April 2020 6:00 AM GMTఅందరూ ఒకే రకంగా ఉండరు. అందరి ఆలోచనలు ఒకరకంగా ఉండవు. ఒకరు ఈ సమయంలో కరోనా కౌంట్లు చూస్తూ ఆందోళనగా కాలం గడుపుతూ ఉంటారు. ఒకరేమో అదే కరోనాపై సరదా పాటలు పాడుతూ ఉంటారు. ఒకరేమో కరోనా పేరు చెప్తే వణికి చస్తే మరొకరు కరోనా వచ్చినా సరే డాక్టర్ వద్దు.. హాస్పిటల్ వద్దు అంటారు. ఇక సెలబ్రిటీలు అయితే చాలామంది కరోనా వల్ల ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే ఈ సాయం చెయ్యడంలో కూడా వివిధరకాలైన మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరు సీఎం రిలీఫ్ ఫండ్ కు. పీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందిస్తున్నారు. కొందరేమో హెల్త్ కేర్ సెక్టార్ లో పని చేస్తున్న వారికి మాస్కులు.. శానిటైజర్లు తదితర వస్తువులను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే విరాళాల సేకరణకు కొందరు సెలబ్రిటీలు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు షార్ట్ ఫిలిమ్స్ చెయ్యడం.. కొందరేమో ఫలానా ఎన్జీవో కు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం అందరికీ భిన్నంగా డేటింగ్ తో ఫండ్స్ రెయిజ్ చేస్తాను అంటూ జనాలు అవాక్కయ్యేలా చేస్తున్నాడు.
అసలే లాక్ డౌన్ కాబట్టి మామూలు డేటింగ్ కుదరదు. అందుకే 'వర్చువల్ డేట్' తో విరాళాలు సేకరించి కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి సాయం అందిస్తానని చెప్తున్నాడు. 'గివ్ ఇండియా'.. 'ఫ్యాన్ కైండ్'.. వారి సహకారంతో ఈ కార్యకమం చేపట్టాడు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను సదరు సంస్థలకు అందిస్తానని తెలిపాడు. ఇంతకీ ఫ్యాన్స్ ఏం చెయ్యాలంటే www.fankind.org/Arjun వెబ్ సైట్ లో డొనేషన్ ఇవ్వాలి. ఇలా డొనేషన్ ఇచ్చిన వారిలో ఐదుమంది లక్కీ విన్నర్లను ఎంపిక చేసి ఏప్రిల్ 11 న వర్చువల్ డిన్నర్ డేట్ కు ఆహ్వానిస్తాడట. అంటే ఎవరింట్లో వారు కూర్చుని.. ఏ వీడియో కాలింగ్ ద్వారానో లేక జూమ్ ద్వారానో అర్జున్ తో కబుర్లు చెప్తూ డిన్నర్ చెయ్యవచ్చు. అంతా బాగానే ఉంది కానీ డేటింగ్ తో ఫండ్స్ రెయిజ్ చెయ్యడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఒకరేమో.. మలైకా కూడా ఉంటుందా అని అడిగితే.. మరొకరు డేటింగ్ తో ఫండ్సా? నువ్వు దేవుడు సామీ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.