Begin typing your search above and press return to search.
వెండితెర లెజండరీ క్రికెటర్ దొరికేశాడు
By: Tupaki Desk | 23 Sep 2017 5:21 AM GMTబయోపిక్ ల పర్వం బాలీవుడ్ లో బాగానే కొనసాగుతోంది. అంతే కాకుండా బాక్స్ ఆఫీస్ రికార్డులను బయోపిక్ తో బద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా చరిత్రలు తిరగరాసిన క్రీడాకారుల జీవితాల్ని ఎక్కువగా తెరపై చూపిస్తున్నారు. గ్రౌండ్ లో అదరగొట్టిన ప్లేయర్స్ దేశం గర్వించేలా గొప్ప పేరు సంపాదించుకోవడానికి ఎన్ని బాధలను అనుభవించారో వంటి విషయాలను ప్రధాన అంశాలుగా తీసుకొని బయోపిక్ లను తీస్తున్నారు.
గత ఏడాది భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ‘ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.. అలాగే సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే తరహాలో భారత దేశానికి మొట్ట మొదటి వరల్డ్ కప్ ని అందించిన లెజండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కబోతోంది. సల్మాన్ తో బజరంగీ భాయీజాన్ - ట్యూబ్ లైట్ వంటి సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ అరుదైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు. అయితే కపిల్ దేవ్ పాత్రకు ఎవరిని సెట్ చేయాలనే విషయంపై దర్శకుడు గత కొంత కాలంగా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు.
మొదట హృతిక్ రోషన్ - రణ్ వీర్ సింగ్ లను సెలక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా అర్జున్ కపూర్ ని ఫైనల్ చేశాడు కబీర్ ఖాన్. 1983లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో కపిల్ దేవ్ అల్ రౌండర్ ప్రతిభను కనబరచి దేశానికి మొదటి వరల్డ్ కప్ ని అందించాడు. త్వరలోనే ఈ బయోపిక్ షూటింగ్ స్టార్ అవ్వనుందని తెలుస్తోంది. అలాగే పలు మాజీ క్రికెటర్స్ కోసం కూడా దర్శకుడు నటులను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఫైనల్ గా చిత్రం యొక్క పూర్తి వివరాలు సెప్టెంబరు 27న చిత్ర యూనిట్ తెలియజేస్తుందట.