Begin typing your search above and press return to search.

ఈసారి అనుష్కను ఎటకారమాడేశాడుగా?

By:  Tupaki Desk   |   16 Jan 2020 5:31 PM IST
ఈసారి అనుష్కను ఎటకారమాడేశాడుగా?
X
సరదాగా.. చలాకీగా ఉండే అర్జున్ కపూర్ కు చమత్కారం ఎక్కువ. ఎవరినైనా ఎటకారమాడేయటం ఆయనకు అలవాటే. గతంలో పలువురు ఆగ్ర కథానాయకలపై వ్యంగ్యాస్త్రాల్ని సంధించి.. కామెడీ చేసిన అతగాడు తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మీద సటైర్లు పేల్చారు.

ఇంట్లో బాల్కనీ వద్ద ఎండలో కూర్చొని టీ తాగుతున్న ఫోటోను బాలీవుడ్ అగ్ర కథానాయికి అనుష్కశర్మ పోస్టు చేశారు. తన ఇన్ స్టా అకౌంట్ లో తన స్టోరీని పోస్టు చేసిన ఆమె.. ఫోటో కింద.. ‘నాకు ప్రియమైన వ్యక్తి ఈ ఫోటో తీశాడ’ని చెబుతూ.. అలా సూర్యకిరణాల కింద టీ తాగుతున్న ఈసన్నివేశం గురుతుగా మిగిలిపోతుందన్నారు.

ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలో అనుష్క టీ షర్టు.. జాగర్ ధరించగా.. కాళ్లకు సాక్స్ వేసుకుంది. చేతిలో కప్పు పట్టుకున్న ఫోటోను పోస్టు చేసింది. దీనిపై అర్జున్ కపూర్ రియాక్ట్ అవుతూ..సాక్స్ డ్రై వాష్ చేశావ్ మరి.. టాప్ చేశావా? అని కామెంట్ చేశాడు. అర్జున్ వ్యాఖ్యకు అనుష్క రియాక్ట్ అవుతూ.. బాస్.. మనం సాక్స్ ఉతికేస్తామా? అని పేర్కొన్నారు. తన చిలిపితనంతో అర్జున్ కపూర్ మరోసారి వార్తల్లోకి వచ్చారని చెప్పాలి.