Begin typing your search above and press return to search.

ప్రియురాలి పై ఆ చెత్త కామెంట్ ఏంటి అర్జున్?

By:  Tupaki Desk   |   6 April 2020 4:15 AM GMT
ప్రియురాలి పై ఆ చెత్త కామెంట్ ఏంటి అర్జున్?
X
సోష‌ల్ మీడియాల్లో సెల‌బ్రిటీలు అప్పుడప్పుడు నోరు జారి బుక్క‌యిపోతుంటారు. ఏదో అనుకుని ఇంకేదో అనేస్తే అది కాస్తా త‌ప్ప‌డు సౌండింగ్ తో డ‌బుల్ మీనింగ్ ఉన్న‌దిగా నెటిజ‌నుల‌కు వినిపిస్తుంది. ఆ క్ర‌మంలోనే ఛాన్స్ దొరికింది క‌దా అని నెలిజ‌నం చెల‌రేగిపోతారు. ఇప్పుడు అలాంటి స‌న్నివేశ‌మే ఎదుర‌వుతోంది మ‌లైకా ప్రియుడు అర్జున్ క‌పూర్ కి. ఇంత‌కీ అర్జున్ త‌న ప్రియురాలిటీపై ఏమ‌ని కామెంట్ చేశాడు? అంటే...

తాజా ఇన్ స్టా పోస్ట్ లో మ‌లైకా ఫోటో ఒక‌టి షేర్ చేసి... దానికి ``తరువాత ఎక్కడ పడుకోవాలో ఆలోచిస్తూ (sic)`` అని రాశాడు. ఆ ఫోటోలో మలైకా త‌న స‌మీపంలో ఏదో చూస్తూ డీప్ గా ఆలోచించేస్తోంది. అస‌లు ఈ లోకంలో ఉన్న‌ట్టుగా లేదు. త‌న ప‌క్క బెంచ్ పై పుస్తకాల స్టాక్ క‌నిపిస్తోంది. ఈ పోస్ట్ లో అర్జున్ వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌ర‌ మైన‌వి గా భావించిన‌ నెటిజ‌నులు త‌మ‌దైన శైలిలో విరుచుకు ప‌డ్డారు. అదేదో ద్వంద్వార్థంతో నిండిన ప‌దం అన్న‌ది ఇత‌రుల ఉద్ధేశం. ఇక మార్చి 22 న జనతా కర్ఫ్యూ రోజున మలైకా - అర్జున్ కలిసి కనిపించారు. క‌రోనాపై పోరాడుతున్న వైద్యుల్ని ప్ర‌శంసించారు. నాటి నుంచి మ‌లైకా త‌న అభిమానుల‌కు సోషల్ మీడియాలో ట‌చ్ లో ఉంది. తన దినచర్యను నిరంతరం ఫోటోల రూపంలో పంచుకుంటుంది. దేశంలో లాక్ డౌన్ నేప‌థ్యం లో ఆన్‌లైన్ యోగా క్లాసులు కూడా తీసుకుంటోంది.

అర్జున్ కెరీర్ సంగ‌తి చూస్తే.., చివరిగా హిస్టారిక‌ల్ మూవీ `పానిపట్` లో న‌టించాడు. అర్జున్- పరిణీతి చోప్రా `ఫిర్ పింకీ ఫరార్‌` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి థియేటర్లు మూసివేయ‌డం వ‌ల్ల ఈ మూవీ రిలీజ్ ఆలస్యమ‌వుతోంది. ఇదేగాక ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని వేరొక‌ రోమ్-కామ్ లోనూ న‌టిస్తున్నాడు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక మ‌లైకా ప్ర‌స్తుతం ర్యాంప్ షోలు.. క్యాట్ వాక్ ల‌తో బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.