Begin typing your search above and press return to search.
సీనియర్ హీరోయిన్స్ ఎవరినీ వదలడా?
By: Tupaki Desk | 20 Sep 2019 7:34 AM GMTబాలీవుడ్లో ఎఫైర్లు.. బ్రేకప్ స్టోరీలే కాదు. ఫ్రెండ్షిప్ లు కూడా ఫుల్ గా ఉంటాయి. అర్జున్ కపూర్ - కత్రినా కైఫ్ కూడా అలానే ఫ్రెండ్స్. ఈ బ్యాచ్ లోనే మరో హీరో వరుణ్ ధావన్ కూడా అప్పడప్పుడు కనిపిస్తుంటాడు. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు సెటైర్లు వేయడం. జోకులు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పట్లో వరుణ్ ధావన్ 'ఐ హేట్ కత్రినా క్లబ్' అని ఒక క్లబ్ మొదలు పెట్టాడట. అందులో అర్జున్ కపూర్ కూడా ఒక సభ్యుడని కాఫీ విత్ కరణ్ షోలో స్వయంగా కత్రినా వెల్లడించింది.
అదేం క్లబ్? దాని కథాకమీషు ఏంటి అని అడిగితే మళ్ళీ భజరంగీ భాయిజాన్ సల్మాన్ ఖాన్ దగ్గరకు పోవాల్సి ఉంటుంది. అప్పట్లో భాయిజాన్.. కత్రినా మాంఛి ఫ్రెండ్సు. ఆ సమయంలో ఎవరైనా కుర్రహీరో కనుక కత్రినాతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తే భాయిజాన్ కు కోపం నషాళానికి అంటేదట. అసలే ముక్కోపి ఖాన్.. ఆయనతో గోక్కోవడం ఎందుకులే అనుకుని కుర్ర హీరోలు 'ఐ హేట్ కత్రిన క్లబ్' మొదలు పెట్టుకున్నారట. "కత్రినా అంటే మాకు ఇష్టం లేదు" అని సెల్ఫ్ డిక్లరేషన్ అన్నమాట! అయితే ఇప్పుడు భాయిజాన్ కోపతాపాలు కాస్త తగ్గి సాధు స్వభావం అలవడడంతో ఈ గ్యాంగ్ అంతా కత్రినాతో ఫ్రెండ్స్ గా మారిపోయారు.
ఇదిలా ఉంటే తాజాగా సోనమ్ కపూర్ కొత్త సినిమా 'ది జోయా ఫ్యాక్టర్' స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ షోకు అర్జున్ కపూర్.. కత్రినా ఇద్దరూ హాజరయ్యారు. షో పూర్తయిన తర్వాత కత్రినా.. అర్జున్ బయటకు వస్తుంటే ఫోటోగ్రాఫర్లు.. ఇతరులు కత్రినా చుట్టూ చేరి ఊపిరి ఆడనివ్వలేదట. దీంతో అర్జున్ ఒక బాడీ గార్డులా వ్యవహరించి కత్రినాను జాగ్రత్తగా కారువరకూ తీసుకెళ్ళాడట. మలైకాతో డేటింగ్ వ్యవహారంలో అర్జున్ కపూర్ కు కాస్త బ్యాడ్ నేమ్ వచ్చింది. అర్బాజ్ ఖాన్ కాపురంలో నిప్పులు పోశాడని కూడా అంతర్జాల అమ్మలక్కలు ఆడిపోసుకున్నారు. ఇలాంటి నేపథ్యం ఉంది కాబట్టి అర్జున్ - కత్రినాల మధ్య ఈ ఫ్రెండ్ షిప్ ను.. ఫ్రెండ్షిప్ గా చూడలేని నెటిజన్లు.. సీనియర్ హీరోయిన్స్ ను ఎవరినీ అర్జున్ వదలడా అని కామెంట్ చేస్తున్నారు.